దేవియాని శర్మ.. బికినీలో జలకన్య లాంటి అందం

ఎరుపు రంగు బికినీ ధరించి, సూర్యకిరణాల్లో మెరిసిపోతూ బీచ్‌ సైడ్‌లో తీర్చిదిద్దుకున్న ఫోటోలు నెటిజన్ల మనసులను దోచేశాయి.

Update: 2024-12-12 07:30 GMT

దేవియాని శర్మ.. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు గోవా బీచ్‌లో బికినీ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఎరుపు రంగు బికినీ ధరించి, సూర్యకిరణాల్లో మెరిసిపోతూ బీచ్‌ సైడ్‌లో తీర్చిదిద్దుకున్న ఫోటోలు నెటిజన్ల మనసులను దోచేశాయి.

సాండ్ టోస్ అండ్ సన్-కిస్డ్ నోస్ అని క్యాప్షన్ పెట్టిన ఈ ఫోటోస్, ఆమె ఫ్యాషన్ స్టేట్మెంట్‌ను మరింత ఎత్తుకి తీసుకెళ్లాయి. దేవియాని తన కాన్ఫిడెన్స్‌తో, ఈ బీచ్ లుక్స్‌లో తన గ్లామర్‌తో ట్రెండ్‌ను సెట్ చేయడం వర్ణనాతీతం. బికినిలో జలకన్య లాంటి అందం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేవియాని కెరీర్ విషయానికి వస్తే, ఆమె మొదట మోడలింగ్ రంగంలో ప్రవేశించి తన ప్రత్యేకతను చాటుకుంది.

"అనగనగా," "సైతాన్," "సేవ్ ది టైగర్స్" వంటి వెబ్ సిరీస్‌లతో తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. నటన గ్లామర్ పరంగా ఆమెకు వెబ్ సిరీస్‌లలో మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం "లైఫ్ స్టోరీస్" అనే వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది. కెరీర్‌ను పదేపదే కొత్త దిశగా నడిపిస్తూ, వెబ్ సిరీస్‌లలో ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటోంది.

గతంలో కూడా దేవియాని తన బికినీ లుక్స్‌తో సోషల్ మీడియా హీట్ పెంచిన సందర్భాలు ఉన్నాయి. ప్రతీసారి ఓ కొత్త ఫోటోషూట్ ద్వారా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న ఆమె, ఈసారి ఎరుపు రంగు బికినీతో కొత్త ట్రెండ్ సృష్టించింది. బీచ్ సైడ్‌లో కూర్చుని తీసిన ఫోటోలు ఆమె నేచురల్ బ్యూటీని హైలైట్ చేశాయి. దేవియాని శర్మ తన ఫోటో షూట్లతో మాత్రమే కాకుండా, తన ఫిట్‌నెస్‌ను కూడా స్పష్టంగా ప్రదర్శిస్తోంది. నెటిజన్ల నుంచి పాజిటివ్ రివ్యూస్‌ను పొందుతూ, ఆమె సోషల్ మీడియాలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.

Tags:    

Similar News