అది హాస్పటల్ కాదు.. ఎలుకల హాస్టల్!

Update: 2015-08-28 12:45 GMT
గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి! గత రెండు రోజులుగా జాతీయ మీడియాతో పాటు, అంతర్జాతీయ మీడియాలో కూడా పేరు మారుమ్రోగిపోతుంది. ప్రతీ మీడియా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. వారం రోజుల వయసున్న పసిబిడ్డను ఎలుకలు చంపి తినేసాయి అనే వార్త దావాణంలా వ్యాపించింది. ప్రపంచం నలుమూలలా ఈ హాస్పటల్ గురించే మాట్లాడుకున్నారు. అయితే ఆ పసివాడి పుణ్యమా అని అధికారుల్లో చలనం వచ్చింది. ఫలితంగా... తూర్పుగోదావరి జిల్లా నుండి పొలాల్లో ఎలుకలు పట్టేవారిని రప్పించి, వారి పద్దతిలో వెదురు బొంగులతో చేసిన బోనుల సాయంతో ఎలుకలను పట్టుకున్నారు!

సుమారు 10మందితో చేయించిన ఈ "ఆపరేషన్ రేట్" లో ఎన్ని ఎలుకలు దొరికాయో తెలుసా? అక్షరాలా ఏభై ఎలుకలు! ఇవి ప్రస్తుతానికి దొరికినవి మాత్రమే... దొరకకుండా కింద కలుగుల్లో, అటకపైనా, మంచాల కిందా ఇంకా ఎన్ని ఎలుకలు దాగిఉన్నాయో తెలియదు! ఈ ఒక్క సంఘటన చాలు... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉందో!
Tags:    

Similar News