బంగ్లా ఎన్నికల్లో చెలరేగిన హింస..17మంది మృతి

Update: 2018-12-31 06:01 GMT
పొరుగుదేశం బంగ్లాదేశ్ లో మరోసారి ప్రజలు అధికార పార్టీ అవామీ లీగ్ కే పట్టం కట్టారు. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాపై విశ్వాసం ఉంచారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజార్టీ దిశగా సాగుతోంది. 299 పార్లమెంట్ స్థానాలకు గాను పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును చేపట్టారు.

బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా విజయం సాధించినట్టు కొద్దిసేపటి క్రితమే ఆ దేశ అగ్రశ్రేణి మీడియా సంస్థలు ప్రకటించాయి. 150కు పైగా సీట్లను సాధించినట్టు తెలిపాయి. ప్రతిపక్ష బీఎన్పీ అభ్యర్థులు 90 సీట్లకు పైగా సాధించినట్టు తెలిపాయి.

కాగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ప్రతిపక్ష బీఎన్పీ ఆరోపించింది. తాత్కాలిక తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కాగా పోలింగ్ సందర్భంగా దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. 17మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రికత్తలకు దారితీశాయి. ఘర్షణల్లో 13 మంది, ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. విపక్ష కార్యకర్తల దాడుల్లో ఓ పోలీస్ మరణించాడు.

ప్రధాని షేక్ హసీనా గోపాల్ గంజ్ నియోజకవర్గంలో బీఎన్పీ అభ్యర్థిపై రికార్డు మెజార్టీతో గెలుపొందారని అధికారులు తెలిపారు. హసీనాకు 2 లక్షలకు పైచిలుకు ఓట్లు రాగా.. ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123ఓట్లు మాత్రమే వచ్చి చిత్తుగా ఓడారట.. షేక్ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి బంగ్లా దేశ్ ప్రధానిగా ఎన్నికవుతుండడడం విశేషంగా చెప్పారు.

 ఒక బీఎన్పీ అధినేత్రి ఖలేదా జియో అవినీతి కేసులో జైలుకు వెళ్లడంతో ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రూల్ ఇస్లాం పార్టీ ఈ ఎన్నికల్లో నడిపించారు. సోమవారం మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.



Full View

Tags:    

Similar News