అమరావతిలో 18 ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పులు

Update: 2015-08-10 11:16 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో 45 లక్షల మందికి ఆవాసం కల్పించాలని అంచనా వేశారు. రాజధాని అంతటా నివాస ప్రాంతాలు ఉండేలా చూస్తారు. మొత్తం నగరాన్ని నాలుగు నివాస మండళ్లుగా నిర్ణయించి, వాటిలో 18 ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేస్తారు. ప్రతి టౌన్ సిప్ పరిధిలో ఉపాధి కల్పన కేంద్రాలు, సామాజిక అవసరాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు, వినోద ప్రదేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న గ్రామాలను పరిరక్షిస్తూనే వాటికి అనుసంధానిస్తూ కొత్త టౌన్ షిప్పులను ఏర్పాటు చేస్తారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో గుంటూరు జిల్లా వైపు 15 టౌన్ షిప్ లు, కృష్ణా జిల్లా వైపు మూడు టౌన్ షిప్పులు ఉంటాయి. గుంటూరు వైపున తాడేపల్లి, మంగళగిరి మండలాలను కలుపుతూ నిర్మించబోయే టౌన్ షిప్ ఎంతో కీలకమైనది. దీనిని ఐదు లక్షల మంది నివాసం ఉండేలా నిర్మించాలని భావిస్తున్నారు. రాజధానిలో రెండో జన సాంధ్రత టౌన్ షప్ గా తుళ్లూరు, దొండపాడు పరిసరాల్లో నిర్మించబోయే టౌన్ షిప్ అవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ 4.90 లక్షల మంది నివశిస్తారని అంచనా వేస్తున్నారు. సీడ్ కేపిటల్ ప్రాంతంలో జనాభా తక్కువ ఉండేలా ఇళ్లు నిర్మిస్తారు. ఇక్కడ కేవలం 1.70 లక్షల మందికి మాత్రమే గృహ వసతి కల్పిస్తారు.

హైస్పీడ్ రైల్ కారిడార్ మందడం సమీపంలో ఉంటుంది. ఇక్కడి టౌన్ షిప్ లో 1.20 లక్షల మంది మాత్రమే ఉండడానికి వీలుగా ఇళ్లను నిర్మించనున్నారు.   సెంట్రల్ యూనివర్సిటీతోపాటు సివిక్ పార్కులు ఎక్కువగా నిర్మించే నీరుకొండ పరిసరాల్లో నిర్మించే టౌన్ సిప్ లో అతి తక్కువగా 57 వేల మంది మాత్రమే ఉండాలని నిర్ణయించారు. సీడ్ కేపిటల్ కు ఆనుకుని ఉండే మల్కాపురం, వెలగపూడి తదితర ప్రాంతాల్లో మాత్రం రెండున్నర లక్షల మంది ఆవాసానికి ప్రణాళికలు రచించారు.
Tags:    

Similar News