మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజూ కూడా లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా జోరుకి బ్రేక్ ఎప్పుడు పడుతుందా అని దేశప్రజానీకం ఆశగా ఎదురుచూస్తున్నారు. నిన్న రెండు లక్షల కి తక్కువగా నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు , తాజాగా మరోసారి రెండు లక్షల దాటేశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్ లో 2,08,921 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 4,147 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా వైరస్ బాధితుల మరణాల సంఖ్య 3,11,388 కు పెరిగింది. మరణాల రేటు 1.14 శాతంగా నమోదైంది. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.60 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,95,955 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు చేరుకుంది. రికవరీ రేటు 89.26 శాతానికి పెరిగింది. అదే సమయంలో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 20,39,087 మంది కాగా, రికార్డ్ స్థాయిలో 22,17,320 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 33,48,11,496 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న 22,17,320 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.