అంకెల మాయాజాలం తప్పించి మరింకేమీ కాదన్నట్లుగా తయారవుతున్నాయి బడ్జెట్ అంచనాలు. బడ్జెట్ ను ఒక్క మాటలో చెప్పాలంటే.. వచ్చే ఆదాయం.. చేసే ఖర్చుకు సంబంధించిన ఒక అంచనా. ఒక వ్యక్తి చేతికి వచ్చే జీతం డబ్బులు.. వాటికి తగ్గట్లుగా అతనెంత ఖర్చు చేస్తాడన్న లెక్కగా చెప్పొచ్చు. దీన్నే ప్రభుత్వానికి పోలిస్తే.. బడ్జెట్ అయిపోతుంది. రాష్ట్ర విభజనకు ముందు రెండు తెలుగురాష్ట్రాల ఉమ్మడి బడ్జెట్ కాస్త అటుఇటుగా రూ.1.20లక్షల కోట్లు. కానీ.. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ మొత్తాన్ని కలిపితే.. అది ఏకంగా రూ.2.50 లక్షల కోట్లుగా మారింది. కచ్ఛితంగా ఇదే అంకె కాకుండా కాస్త దగ్గరదగ్గరగా ఇంతే మొత్తం వచ్చే పరిస్థితి.
బడ్జెట్ అంచనాల్ని భారీగా వేసేయటం.. అంకెల మాయాజాలంతో అంచనాల్ని విపరీతంగా పెంచేస్తున్నారన్న విమర్శ ఉంది. కాగితం మీద అంకెలే తప్పించి.. వాస్తవంలో అంత సీన్ ఉండదన్న విపక్షాల మాటలకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆటెల రాజేందర్ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఈ ఏడాది ఆదాయ వ్యయాల అంచనాకు.. వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఏమిటన్న అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఏడు నెలల్లో శాఖల వారీగా కేటాయింపులు.. వ్యయాన్ని సమీక్షించారు.
మొదటి ఆరు నెల్లలో ఆదాయం అనుకున్న దాని కంటే 21 శాతం పెరిగినా.. వ్యయం కూడా అదే తీరులో పెరిగిన విషయాన్ని గుర్తించారు. ఇక.. బడ్జెట్ లో పేర్కొన్నట్లుగా రూ.1.29లక్షల కోట్లు చూపించిన తీరులో రాబడులు వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం తాజా సమావేశంలో వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో రూ.20వేల కోట్ల వరకూ కోత వేయాల్సి ఉంటుందన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బారీగా నిధులు కేటాయించిన రంగాల్లో ఖర్చులు అంత స్థాయిలో లేకపోవటం.. కేటాయించిన మొత్తాన్ని మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసే అవకాశం లేదన్న భావన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఇతర అవసరాల దృష్ట్యా బడ్జెట్ నిధుల్ని సర్దుబాటు చేయటంపై కసరత్తు చేసిన ఆర్థిక మంత్రి ఈటెల బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయిల్ని కోత పెట్టాలని డిసైడ్ చేయటం గమనార్హం.
అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్లుగా పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలని అధికారుల్ని మంత్రి ఈటెల కోరటం విశేషం. గొప్పగా వేసుకున్న అంచనాలు వాస్తవంలో ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఎందుకు కోత విధించుకోవాల్సి వచ్చిందన్న విషయంపై తెలంగాణ సర్కారు వివరణ ఇస్తుందా? అన్న ప్రశ్నకు లేదనే చెప్పాలి. ఆదాయం బాగానే ఉన్నా.. బడ్జెట్ అంచనాల్లో కోత విధించటం ప్లానింగ్ లో దొర్లినా పొరపాటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్భాటాలకు పోయే కన్నా.. వాస్తవిక దృష్టితో బడ్జెట్ అంచనాల్నిసిద్ధం చేసి ఉంటే.. ‘కోత’ పరిస్థితి వచ్చేది కాదన్న విమర్శలో నిజం ఉందని చెప్పక తప్పదు.