నిర్భయ కేసులో మరో ట్విస్ట్..తీర్పు రాస్తూ కుప్పకూలిన సుప్రీం న్యాయమూర్తి !
ఢిల్లీలో గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన గురించి అందరికి తెలిసిందే. అయితే, ఈ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ కేసు వ్యవహారం ఒక కొలిక్కి రావడంలేదు. దోషులని జైలుకి - కోర్టులకి తిప్పుతున్నారు తప్ప ...ఒక పరిష్కారం అంటూ చూపడటంలేదు. ఇప్పటికే నిర్భయ కేసులో దోషులకు ఉరి అంటూ ఎన్నో డేట్స్ ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా చివరి నిమిషానికొచ్చేసరికి శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. కారణం ఏదైనా కూడా నిర్భయ కేసులో ఏవిదంగా జరుగుతుండటం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ విదంగా చేస్తున్నారు కాబట్టే మన దేశంలో న్యాయ వ్యవస్థ పై నమ్మకం రోజురోజుకి సన్నగిల్లుతోంది అని కొందరు నిపుణులు చెప్తున్నారు.
ఇకపోతే , నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి - ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టింది. తాను దాఖలు చేసిన క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టులో పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీనిపై ఈ ఉదయం సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ ఆర్ భానుమతి - జస్టిస్ ఎస్ ఏ బొపన్న - జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం విచారణ ముగించింది. వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది.
అయితే , ఆ తరువాత ఈ కేసుకి సంబంధించిన తీర్పు కాపీని రాస్తున్న సమయంలో.. జస్టిస్ ఆర్ భానుమతి స్పృహ కోల్పోయారు. ఆమె కూర్చొని ఉన్న కుర్చీలోనే పక్కకు పడిపోయారు. పక్కనే ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే గమనించి .. ఆమెను వీల్ చైర్ పై ఛాంబర్ కు తరలించారు. డాక్టర్లను పిలుచుకుని వచ్చారు. భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆమెకి ముందు నుండే జ్వరం ఉంది అని , కీలక కేసులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె జ్వరంతోనే - మందులు తీసుకోని విధులకు హాజరైయ్యారని - కానీ , జ్వరం మరింతగా విషమించడంతో స్పృహ కోల్పోయారని తుషార్ మెహతా తెలిపారు. ప్రస్తుతం జస్టిస్ భానుమతికి డాక్టర్లు చికిత్స చేస్తున్నారని తెలిపారు.
అయితే , ఈ రోజుతో నిర్భయ దోషుల పని అయిపోతుంది అని భావించినప్పటికీ , అనుకోని విధంగా జరిగిన ఈ ఘటన తో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని పూర్తి చేయలేకపోయింది. దీనితో ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. భానుమతి పూర్తిగా కోలుకున్న తరువాతే తీర్పు కాపీని వెలువడిస్తామని సుప్రీం వెల్లడించింది. అయితే ,వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో , దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఇక ఏ ఇబ్బంది ఎదురుకాదు అని న్యాయవాదులు చెబుతున్నారు.