సమాజానికి సమాచారం అందించటమే పరమావధిగా భావించే పాత్రికేయం మారిన కాలంలో మరింత ఇబ్బందికరంగా మారింది. నిజాన్ని ప్రపంచానికి చెప్పేందుకు జర్నలిస్ట్ పడే కష్టం అంతాఇంతా కాదు. అలా అని అందరూ జర్నలిస్టులు అలానే ఉంటున్నారని చెప్పలేం. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో రాగద్వేషాలకు లోనవుతున్నజర్నలిస్టుల కారణంగా పాత్రికేయ రంగం కాస్తంత మసకబారిన పరిస్థితి. పోటీ నేపథ్యంలో మీడియా మేనేజ్ మెంట్లు తీసుకుంటున్న స్టాండ్ల కారణంగా పాత్రికేయుల మీద తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇప్పటికీ ప్రజల పట్ల మమకారం.. వారి బాగోగుల మీద ఆవేదనతో తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పని చేసే వృత్తి ఏదైనా ఉందంటే.. అది పాత్రికేయం ఒక్కటేనని చెప్పక తప్పదు. గతంతో పోలిస్తే.. జర్నలిస్టు వృత్తికి ఉన్న చరిష్మా మసకబారిన పరిస్థితి. అయితే.. సత్యశోధన విషయంలో అలుపెరగని జర్నలిస్టులు ఎందరో హత్యకు గురి అవుతున్న వైనం వింటే ఈ వృత్తి ఎంత ప్రమాదకరమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితి ఒకటేలా ఉందని.. వారి ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న విషయం తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో హత్యకు గురైన జర్నలిస్టుల అంశంపై అధ్యయనం చేసిన యునెస్కో షాకింగ్ వివరాల్ని బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 827 మంది జర్నలిస్టులు పదేళ్ల వ్యవధిలో మరణించినట్లుగా తేల్చింది. సిరియా.. ఇరాక్.. లిబియా.. యెమెన్.. లాటిన్ అమెరికా దేశాల్లో ఈ హత్యల పరంపర మరింత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తేల్చింది. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో 59 హత్యలు జరిగినట్లుగా తేల్చింది.
ఒక లెక్క ప్రకారం ప్రతి నాలుగున్నర రోజులకో హత్య.. వారానికి ఐదు హత్యల వరకూ జరుగుతున్నట్లుగా చెప్పొచ్చు. ఎక్కువ మంది జర్నలిస్టులు అరబ్ దేశాల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు వదలటం గమనార్హం. ఇక.. విదేశీ పాత్రికేయులతో పోలిస్తే.. స్థానికంగా పని చేసే పాత్రికేయుల ప్రాణాలకే ఎక్కువ ముప్పు ఉందన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేసింది. జర్నలిస్టుల హత్యలకు ముందు.. వారిని కిడ్నాప్ చేయటం.. దారుణంగా హింసించిన తర్వాత చంపేస్తున్నారని సదరు నివేదిక తేల్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/