ఓర్నీ.. రెంట్లు ఎక్కువని ఫ్లైట్లో అప్ అండ్ డౌన్ చేస్తోంది!

Update: 2023-06-20 09:00 GMT
ఉద్యోగం కోసం... చాలా మంది ప్లేసులు మారాల్సి ఉంటుంది. అయితే ఖరీదైన ప్రాంతాలు అయితే అక్కడ అద్దెలు ఎక్కువగా ఉండటం సహజం. అలాంటి ప్రదేశాల్లో సామాన్యులు నివసించాల్సి వస్తే... ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. వచ్చిన జీతం దానికే సరిపోతుంది. ఇక డబ్బు ఆదా అనేది కష్టం అవుతుంది.

అందుకే   చాలా మంది కష్టమైన సరే.. రెంట్‌ తక్కువగా ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వెళ్తుంటారు. బండి మీదో, బస్సులోనే గంటల తరబడి ట్రాఫిక్‌ ను దాటుకుంటూ విధులకు చేరుకుంటారు. అయితే... అమెరికా లో ఓ అమ్మాయి మాత్రం ఇంటి అద్దెలు భరించలేక.. వందల మైళ్లు ప్రయాణం చేస్తోంది. అది కూడా విమానంలో  వెళ్లి వస్తోంది.

అదేంటి అనుకుంటున్నారా... నిజమేనండి. ఆమె అద్దెలు కట్టలేక...  విమానంలో ఆఫీసుకు అప్ అండ్ డౌన్ చేస్తుందంట. సౌత్‌ కరోలినా లోని కార్లెస్టన్‌ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సోఫియా సెలెంటానో  యూనివర్శిటీ ఆఫ్‌ వర్జీనియాలో చదువుతోంది. వేసవి సెలవులకు కార్లెస్టన్‌ కు వచ్చిన ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్‌ హెల్త్‌ అనే అడ్వర్టైజింగ్‌ సంస్థలో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభించింది.

అయితే న్యూజెర్సీ లో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ.  కనీసం నెలకు 3400 డాలర్లు చెల్లించాలి. అయితే... రెండునెలల తన ఇంటర్న్‌షిప్‌ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలి. దీంతో అద్దెలు భరించలేని ఆమె వినూత్న ఆలోచన చేసింది. కార్లెస్టన్‌ నుంచి సుమారు 700 మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్సీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది.

రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా.. అందుకు విమాన టికెట్‌, క్యాబ్‌ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుంది. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఎక్కువ డబ్బులు పెట్టే బదులు ఇలా... ప్లైట్ లో అప్ అండ్ డౌన్ చేస్తూ... విమానప్రయాణం చేస్తోంది.

అయితే ఇందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని  రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నానని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని సోఫియా ఇటీవల తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.  ఆమె జర్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Similar News