మహారాష్ట్ర పై కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకూ అక్కడ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఐతే మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోసా సోకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాంగ్లి జిల్లా ఇస్లామ్‌పూర్‌లో ఓ ఉమ్మడి కుటుంబంలో ఈ కరోనా కేసులు నమోదయ్యాయి. మొదట నలుగురు కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో పర్యటించి కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు వచ్చారు. మార్చి 23న వారికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది.
ఆ తరువాత అనుమానంతో కుటుంబ సభ్యలందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించి పరీక్షలు చేయగా.. వారం రోజుల వ్యవధిలోనే మరో 21 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మొత్తం 47 మందికి టెస్ట్‌లు చేయగా 25 మంది కరోనా బారినపడ్డారు. అయితే ఇది ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమైందని, వారు కాకుండా ఇతరుకు వ్యాపించలేదని జిల్లా కలెక్టర్ అభిజిత్ చౌదరి తెలిపారు.
ఐతే మహారాష్ట్రలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కేసులు నమోదు కాలేదని.. ప్రైమరీ కాంటాక్ట్ కేసులు మాత్రం నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తిని నేరుగా తాకడం వల్లే వ్యాధి సంక్రమించిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులంతా పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారని, అందువల్లే ఒకరి నుంచి మరొకరికి సోకిందని కలెక్టర్ అభిజిత్ చౌదరి తెలిపారు. ఒకే కుటంబానికి చెందిన వారికి కరోనా సోకడం తో ముందు జాగ్రత్తగా ఆ చుట్టుపక్కల కి.మీ. దూరంలోని ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా కలెక్టర్ ప్రకటించారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 215 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం కొత్తగా మరో 12 మంది కరోనా బారినపడినట్లు పరీక్షల్లో తేలింది.