వారంలో సజ్జనార్ కు 2500 మిస్డ్ కాల్స్?

Update: 2019-12-07 06:34 GMT
దిశ హత్యాచార ఉదంతం తర్వాత పెల్లుబికిన ప్రజా నిరసన ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఇద్దరు కలిసినా దీని గురించి మాట్లాడుకునే పరిస్థితి. పోలీసుల వైఫల్యం పేరుతో వచ్చిన కథనాలు పోలీసుల మీద తీవ్ర ఒత్తిడిని చూపాయి. ఇదిలా ఉంటే.. సైబరాబాద్ సీపీగా వ్యవహరిస్తున్న సజ్జనార్ కు గడిచిన వారంలో వచ్చినన్ని మిస్డ్ కాల్స్.. మెసేజ్ లు గతంలో ఎప్పుడూ రాలేదట.

దిశ ఘటన జరిగింది సజ్జనార్ పరిధిలోనే కావటం.. ఈ వ్యవహారానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే బాస్ ఆయనే కావటంతో పలువురు ప్రముఖులు.. తెలిసిన వారు ప్రతిఒక్కరూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారట. గడిచిన వారంలో ఆయనకు ఏకంగా 2500 మిస్డ్ కాల్స్ వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక.. మెసేజ్ లకైతే లెక్క లేదని.. వాట్సాప్ కు మెసేజ్ లు వరదలా పోటెత్తాయని తెలుస్తోంది. చాలామంది ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు.. వారి భార్యలు.. కుటుంబ సభ్యులు పలువురు సజ్జనార్ కు.. ఆయన సతీమణికి ఫోన్ చేసి దిశ నిందితుల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారట. ఈ ఎపిసోడ్ లో సజ్జనార్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.  

అయితే.. తనకు ఎదురైన ఒత్తిడిని సజ్జనార్ ఎవరితోనూ చర్చించలేదని.. కామ్ గా.. కూల్ గా ఉంటూ తనకు తానే ఆ పెయిన్ తీసుకున్నట్లు సమాచారం. కేసు విచారణను చట్టబద్ధంగా జరపాలన్న యోచనలోనే సజ్జనార్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చే ఒత్తిడితో పాటు పౌర సమాజం నుంచి వస్తున్న డిమాండ్లకు తలొగ్గకూడని ఆయన భావించినట్లు చెబుతున్నారు. అనుకోని రీతిలో జరిగిన ఎన్ కౌంటర్ ఆయనకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. దీంతో గడిచిన కొద్ది రోజులుగా వెల్లువెత్తుతున్న ఒత్తిడి కాస్త తగ్గినట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News