ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఎలా ఉండాలన్న మాటను ఒకేఒక్క లైనులో చెప్పాలంటే.. ‘‘ట్రంప్ లా ఉండకూడదు’’ అన్న మాట ఈ మధ్యన ఎక్కువైంది. తన కంపు మాటలతో ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ట్రంప్.. తాజాగా మరో దారుణమైన వ్యాఖ్య చేశారు. ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్.. ఈసారి ఏకంగా 27 శాతంమంది ముస్లింలు ఉగ్రవాదులని సెలవివ్వటం భారీ కలకలానికి కారణంగా మారింది.
ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంలో ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ముస్లింలలో నాలుగో శాతం మంది కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులేనని ఆయన అభిప్రాయ పడ్డారు. 27 శాతం మంది ముస్లింలు ఉగ్రవాదులేనని.. వారి సంఖ్య 35 శాతం వరకూ ఉండొచ్చంటూ ట్రంప్ తెగబడ్డారు. ‘‘వారు ఉగ్రవాదం వైపు పోరాడతారు. విద్వేషం భారీ స్థాయిలో ఉంది. ఉగ్రవాదులు లక్ష మందే అంటూ చెబుతున్న అధ్యయన ఫలితాలు తప్పు’’ అని తేల్చేశారు.
ముస్లింల మీద ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ట్రంప్ మాటలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం రియాక్ట్ అయ్యారు. విద్వేషాల్ని రెచ్చగొట్టే భాషను ఉపయోగిస్తున్న ట్రంప్ ను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్న వారు.. అమెరికా ఇప్పుడున్న దాని కంటే మెరుగ్గా ఎలా తీర్చిదిద్దాలనే విషయం మీద ఫోకస్ చేయాలే తప్పించి.. ఇతరులను అవమానించటం.. జాతి ఆధారంగా ప్రజల్ని విభజించే ధోరణి ఏ మాత్రం సరికాదన్నారు. ట్రంప్ లాంటి వ్యక్తి.. ఒబామా మాటల్ని పట్టించుకుంటారా?