సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళలో.. చుట్టూ నిరాశతో నిండి ఉన్న వేళలో డీఆర్ డీవోకు సంబంధించిన ఒక వార్త అందరిని అమితంగా ఆకర్షించింది. కరోనాపై పోరాటం చేసేందుకు సదరుసంస్థ రూపొందించిన పౌడర్ (2డీజీ) కరోనా మీద పోరటానికి సరికొత్త ఆయుధంగా అభివర్ణించారు. తాము రూపొందించిన ఫార్ములాను ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ సొంతం చేసుకోవటం.. దాని ఉత్పత్తి షురూ చేయటం తెలిసిందే.
తాజాగా ఈ పౌడర్ ను బహిరంగ మార్కెట్లోకి తొలిసారి విడుదల చేశారు. తొలి దశలో దేశంలోని ప్రధాన నగరాలకు విడుదల చేస్తామని.. దశల వారీగా మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఈ ఔషధాన్ని మన దేశంలో అత్యవసర అనుమతి మంజూరు చేశారు. దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. ప్రయోగాత్మకంగా కొన్ని పాకెట్లను కొన్ని చోట్ల ఉచితంగా పంపిణీ చేసి ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. అది కాస్తా సక్సెస్ కావటంతో కరోనా మీద యుద్ధానికి బహిరంగ విపణిలోకి తీసుకొచ్చారు.
బహిరంగ మార్కెట్లోకి వచ్చిన 2డీజీ పౌడర్ పాకెట్ ధరను తాజాగా నిర్ణయించారు. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం ఒక్కో పాకెట్ ధరను రూ.990కు డిసైడ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రాయితీ మీద అందజేయనున్నరు. ఈ మందును వైద్యుల పర్యవేక్షణలోనే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్ లక్షణాలున్న వారు త్వరగా దీని నుంచి బయటపడటానికి సాయం చేస్తుందని రెడ్డీస్ ల్యాబ్ వెల్లడించింది. 99.5 శాతం స్వచ్ఛతతో ఈ పౌడర్ ను ఉత్పత్తి చేస్తున్నారు. డెల్టా ప్లస్ తో పాటు థర్డ్ వేవ్ బయాందోళనల నేపథ్యంలో కరోనా మీద కత్తి దూయటానికి 2డీజీ పేరుతో మరో అస్త్రం చేతికి వచ్చినట్లేనని చెప్పక తప్పదు.