ఆట మొద‌లైంది.. కేసులు బుక్ అయ్యాయి

Update: 2015-07-02 13:04 GMT
ఓటుకు నోటుకు సంబంధించిన కేసు స‌రికొత్త రూపం దాలుస్తోంది. నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంగా క‌ల‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఈ కేసులో రేవంత్‌కు బెయిల్ ల‌భించి బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో చెల‌రేగిపోవ‌టం తెలిసిందే. అత్యంత ప‌రుష ప‌ద‌జాలంతో తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. మంత్రుల‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు స‌మీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పేర్కొన్న విధంగా ఆట మొద‌లైంద‌న్న దానికి త‌గ్గ‌ట్లే రేవంత్ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.
అభిమానులు.. స‌న్నిహితుల కేరింత‌ల నేప‌థ్యంలో చెల‌రేగిపోయి మాట్లాడిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు స్పందించింది. ఆయ‌న‌పై న‌గ‌రంలోని  పోలీస్ స్టేష‌న్‌లలో మూడు కేసులు న‌మోద‌య్యాయి.

అనుమ‌తి లేకుండా ర్యాలీ నిర్వ‌హించ‌టం.. ట్రాఫిక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించటంతో పాటు.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించ‌టం లాంటి ఆరోప‌ణ‌ల‌తో కేసులు న‌మోద‌య్యాయి. కుషాయిగూడ‌.. మ‌ల్కాజిగిరి స్టేష‌న్ల‌లో రేవంత్‌రెడ్డిపై సెక్ష‌న్ 341.. 188.. 506.. 509 కింద కేసులు న‌మోదు చేశారు. మ‌రి.. దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తారో..? ఆట మొద‌లైంద‌న్న‌ట్లుగా రేవంత్‌మాట‌లు ఉంటే.. దానికి ప్ర‌తిగా పోలీసు కేసులు న‌మోద‌య్యాయ‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News