అంతుపొంతు లేనట్లుగా.. టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరగటం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితికి ఏ మాత్రం తీసిపోనట్లుగా 39 ఏళ్ల నాడు తీసిన సినిమాలోని ఒక సీన్ ఉండటం ఆశ్చర్యంగా మారింది. ఇప్పుడీ సీన్ వైరల్ గా మారింది.
39 ఏళ్ల క్రితం పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం చిత్రం. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో ఒక సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1981లో విడుదలైన ఈ సినిమాలో ఉన్న ఆ సీన్ ఏమంటే.. ఒక ఇంటర్వ్యూకు హాజరవుతాడు నిరుద్యోగిగా ఉండే కమల్ హాసన్.
ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అని ప్రశ్నిస్తారు. దీనికి కమల్ బదులిస్తూ.. ఈ రోజా? నిన్నా? మొన్ననా? అని ప్రశ్నిస్తూ.. ఎందుకంటే అక్కడ రోజుకొకరు మారుతున్నారు కదా? అని బదులిస్తారు. 39 ఏళ్ల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉండటం.. నాటి రీల్ క్లిప్ చూసినోళ్లంతా సర్ ప్రైజ్ అవుతున్న పరిస్థితి. దీంతో.. ఈ క్లిప్ ను షేర్ చేస్తున్నారు.