గ్రామానికి నాలుగుఇళ్లు:హడలిపోతున్నఎమ్మెల్యేలు

Update: 2015-11-03 04:26 GMT
అరచేతిలో స్వర్గం చూపిస్తానని చెప్పి జనాన్ని నమ్మించి ఓట్లు దండుకోవడంలో కేసీఆర్‌ ని మించిన రాజకీయనేత  బహుశా ఎవరూ ఉండరేమో. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ చేసిన వాగ్దానాలు టూసి బ్రహదేవుడికే వణుకు పుట్టి ఉంటుందంటే ఆశ్చర్య పడాల్సింది లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన వాగ్దానాల్లో ఒక్కదాన్నికూడా అమలుచేయడంలో పాలనాయంత్రాగం ఘోరవైఫల్యం ఆశ్చర్యం కలిగించడంలేదు. ఉదాహరణకు పేదప్రజలందిరికీ రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తానన్నది కేసీఆర్ వాగ్దానాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క వాగ్దానంతోటే తెలంగాణ ప్రజలు గంపగుత్తగా ఓట్లేసి తెరాసను గెలిపించారు.

కానీ మాటలు మాట్లాడటం ఎంత సులువో చేతల విషయానికి వచ్చేసరికి అంత కష్టమని ఇప్పుడు కదా తత్వం బోధపడుతోంది. దసరా పండుగ రోజు ప్రారంభించిన ఈ విశిష్ట పథకం డొల్లతనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. పేదలందరికీ ఇళ్లు అనే వాగ్దానం స్థానంలో తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ కేవలం నలుగురికి మాత్రమే రెండు పడకగదుల ఇళ్లను నిర్మించి ఇస్తారట. దీంతో ప్రజలకు ముఖం చూపించలేక తెరాస ఎమ్మల్యేలు నియోజకవర్గాలకు దూరం జరుగుతున్నారని సమాచారం.

పేదలకు రెండుపడక గదుల నిర్మాణ పథకం తొలిదశలో 60 వేల ఇళ్లను నిర్మించాలని తలపెట్టారు. వీటిలో 36 వేల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో కడుతుండగా మిగిలినవి గ్రామీణ ప్రాంతాలకు కేటాయించారు. అసలు చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది. ఈ ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల జాబితాను స్థానిక ఎమ్మెల్యేనే సిద్ధం చేయాల్సి ఉంది. దాంతో ఎవరిని ఎంపిక చేస్తే ఎవరికి ఎక్కడ కాలుతుందోనని ఎమ్మెల్యేలు హడలి చస్తున్నారట.  ఒక్కో ఊరిలో నలుగురినిమాత్రమే లబ్ధిదారులుగా ఎమ్మెల్యే ఎంపిక చేస్తే మిగతా వారు ఆయనకు బద్ధ శత్రువులైపోరా..  ఈ భయంతోనే తెరాస ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు రావటం మానుకుంటున్నారట.
Tags:    

Similar News