బాబు పాల‌న‌లో..జిల్లా మొత్తం అంధ‌కారం

Update: 2017-09-23 04:39 GMT
దేశంలో త‌న పాల‌నే బెస్ట్‌. తానే ఉత్త‌మ సీఎం అని ప‌దేప‌దే డ‌బ్బాలు కొట్టుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో అంధ‌కారం అలుముకుంది! నిజ్జంగా ఇది నిజం! విద్యుత్ విష‌యంలో ఏపీని ప‌రుగులు పెట్టిస్తున్నాన‌ని, మిగిలిన రాష్ట్రాల‌కు సైతం అమ్ముతున్నామ‌ని, మా క‌న్నా పోటుగాడు లేడ‌ని చెప్పుకొచ్చే బాబు పాల‌న‌లో శుక్ర‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లా మొత్తం అంధ‌కారంలో గ‌డిపింది. నిజానికి విద్యుత్ విష‌యంలో తాము చేసిన, చేస్తున్న ప్ర‌యోగాలు అన్నీ ఇన్నీ కావ‌ని శుక్ర‌వారం సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో త‌న‌ను క‌లిసిన ఇండో-అమెరిక‌న్ పెట్టుబ‌డుల బృందానికి వివ‌రిస్తున్న స‌మ‌యంలోనే విజ‌య‌న‌గ‌రంలో క‌రెంటు ఫీజు పేలిపోయింది. అర్ధ‌రాత్రి రెండు గంట‌ల వ‌ర‌కు కూడా అధికారులు కానీ, సిబ్బంది కానీ విద్యుత్‌ ను పున‌రుద్ధరించ‌లేక‌పోవ‌డంతో జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైద్య శాల‌ల్లో గ‌ర్భిణులు - చిన్నారుల అవ‌స్థ‌లు ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఇక‌, కీల‌క‌మైన ఆప‌రేష‌న్ల‌ను సైతం జ‌న‌రేట‌ర్ల సాయంతో నిర్వ‌హించిన‌ట్టు జిల్లా వైద్య అధికారులు వెల్ల‌డించారు. ప‌లు ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయి. ఉత్ప‌త్తి నిలిచిపోయి కార్మికులు ఇంటి ముఖం ప‌ట్టారు. ఇక‌, జిల్లాలో రాత్రి పూట తీవ్ర అంధ‌కారం అలుముకోవ‌డంతో ప్ర‌జ‌లు బిక్కు బిక్కు మంటూనే కాలం గ‌డిపారు. దోమ‌ల మ‌ధ్యే జీవ‌నం గ‌డిపారు. ఫ్యాన్లు తిర‌గ‌క‌ - ఇళ్ల‌లో క‌రెంటు లేక వృద్ధులు - చిన్నారులు అల్లాడిపోయారు. దీంతో మ‌రోసారి చంద్ర‌బాబు మేడి పండు ప్ర‌క‌ట‌న‌ల‌పై జ‌నాలు పెద‌వి విరిచారు. విద్యుత్ విష‌యంలో ఎన్నో క‌బుర్లు చెప్పే చంద్ర‌బాబు దాదాపు 18 గంట‌ల‌కు పైగా క‌రెంటు క‌ట్ అయినా త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చంటిబిడ్డ త‌ల్లులైతే.. ఒక చేత్తో విస‌నిక‌ర్ర విసురుతూ.. బిడ్డ‌ల‌ను జోకెట్టారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు.. ప్ర‌యోగాలు మాని.. త‌మ‌కు క‌రెంటును స‌రిగా పంపిణీ చేస్తే చాల‌ని వారు అన‌డం గ‌మ‌నార్హం. విశాఖ జిల్లా పరవాడ హిందూజా పవర్‌ ప్లాంట్‌ లో ఉత్పత్తి నిలిచిపోవడంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, దీనిపై స్పందించేందుకు మంత్రి క‌ళా వెంక‌ట్రావు కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో చంద్ర‌బాబు - మంత్రి క‌ళాపై మండిప‌డ్డారు. సో.. ఇదీ బాబు గారి పాల‌న‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా!!
Tags:    

Similar News