ఇంతకీ.. ఆ రూ.50లక్షలు ఎక్కడివి?

Update: 2015-08-17 04:43 GMT
ఒక విషయంలో.. తెలంగాణ ఏసీబీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంతగా ప్రయత్నించినా కూడా ఇంచు కూడా సమాచారం అందక కిందామీదా పడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి రూ.50లక్షలు ఇవ్వటం తెలిసిందే.

నల్లబ్యాగులో రూ.50లక్షల మొత్తాన్ని తీసుకొచ్చి.. స్టీఫెన్ ఇంటి టేబుల్ మీద పెట్టటం.. దాన్ని బ్యాగులో నుంచి ఒక బండిల్ ను రేవంత్ సహాయకుడు బల్ల మీద పెట్టటం లాంటి దృశ్యాలు వీడియో రికార్డు కావటం.. ఆ వీడియో టీవీ ఛానళ్లలో ప్రసారం కావటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినఈ ఉదంతంలో అత్యంత కీలకమైన రూ.50లక్షల మొత్తానికి సంబంధించిన సమాచారం పీట ముడులు పడ్డాయి.

కేసుకు సంబంధించినంత వరకూ రేవంత్ రెడ్డి తో పాటున్న సంచిలోని రూ.50లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరిచ్చారు? అన్న అంశంపై మాత్రం ఒక్కటంటే.. ఒక్క ఆధారం లభించటం లేదు. కేసులో అత్యంత కీలకమైన ఈ అంశంపై ఏం చేయాలో అర్థం కాక.. ఎలా ముందుకెళ్లాలో టీ ఏసీబీ అధికారులకు ఒక పట్టాన తోచటం లేదు.

రూ.50లక్షలకు సంబంధించిన అంశం ఒక మిస్టరీగా మారిపోవటం.. దాన్ని ఏ విధంగా చేధించాలో అర్థం కాని నేపథ్యంలో..  పలు మార్గాలపై అధికారులు దృష్టి సారించారని చెబుతున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న జెరూసలెం ముత్తయ్య.. జిమ్మిబాబు.. కొండల్ రెడ్డి తదితరులు కానీ విచారణకు సహకరిస్తే.. ఈ అంశాల్ని ఈజీగా తేల్చేయొచ్చని చెబుతున్న టీ అధికారులు.. అదంత తేలిక కాదన్న విషయం తెలుసు. రూ.50లక్షల మిస్టరీని కానీ చేధిస్తే.. రేవంత్ రెడ్డి అండ్ కోలను న్యాయపరంగా బుక్ చేయటం పెద్ద విషయం కాదని చెబుతున్నారు. కానీ.. రూ.50లక్షలు ఎక్కడివి అన్న దగ్గరే టీ ఏసీబీ అధికారులు ఆగిపోతున్నారు. మరి.. దీనిపై ఎప్పటికి అడుగు ముందుకు పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News