ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకి పెరుగుతూనే పోతుంది తప్ప, తగ్గడం లేదు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరుకుంది. ఇప్పటి వరకు 780 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.
ఇంతవరకూ 38 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 1015 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, గుంటూరులో 10, కడపలో 6, కృష్ణాలో 16, కర్నూలులో 7, నెల్లూరులో 4, విశాఖపట్నంలో 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు లేని విజయనగరం జిల్లాలో ఒక్క రోజే 3 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.