బడ్జెట్ బయటకు వచ్చింది. ప్రతిసారీ మాదిరే ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. ఎవరికి వారు ఏమేమో జరుగుతుందని అనుకోవటం.. ప్రభుత్వ ఎజెండా తప్పించి మరే అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా.. తమకు మాత్రమే నచ్చే అంశాల్ని పొందుపర్చుకోవటం ఇటీవల కాలంలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఉండే మొహమాటాల్ని దాదాపుగా తీసి అవతలపారేసిన మోడీ సర్కారు.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో తన రాజకీయ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.
ఏదైనా రాష్ట్రానికి అదనంగా వంద కోట్లు కేటాయించాలంటే కిందా మీదా పడిపోయి.. ఆచితూచి నిధులిచ్చే కేంద్రం ప్రధాని మోడీ రక్షణ ఖర్చు విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. గడిచిన రెండు.. మూడేళ్ల వ్యవధిలో ప్రధాని మోడీ భద్రతా ఖర్చు లెక్క నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఒక సంవత్సరానికి మరో సంవత్సరానికి సంబంధం లేనంత భారీగా పెరిగిపోతోంది. ఈ ఏడాది బడ్జెట్ లో ప్రధానికి ప్రత్యేకంగా రక్షణ ఉండే ఎస్పీజీకి కేంద్రం ఏకంగా రూ.600 కోట్లు కేటాయించటం గమనార్హం.
రెండేళ్ల క్రితం మోడీ భద్రత కోసం రూ.420 కోట్లు ఉండేది. దాన్ని గత ఏడాదిలో ఒక్కసారిగా రూ.120 కోట్లు పెంచుతూ రూ.540 కోట్లకు చేర్చారు. ఈ ఏడాది బడ్జెట్ లో మరో రూ.60 కోట్లు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఏడాదికి ప్రధాని భద్రత కోసం జాతి జనులు చెల్లించాల్సిన మొత్తం రూ.600 కోట్లుగా ఉండటం విశేషంగా మారింది. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నేతల భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్న మోడీ ప్రభుత్వం.. తన వరకూ వచ్చేసరికి ఇన్నేసి కోట్ల కేటాయింపునకు ఏ మాత్రం మొహమాటపడని తీరు కనిపించక మానదు. ఏమైనా.. ప్రధాని భద్రత కోసం ఇంత భారీగా కేటాయింపులు మోడీ హయాంలోనే అన్న మాట వినిపిస్తోంది.