70 శాతంమందికి ఆన్ లైన్ పాఠాలు అర్థం కావడం లేదట

Update: 2020-07-22 10:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత ఏడాది చివర్లో చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ..ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ వ్యాపిస్తూ ప్రపంచాన్ని కప్పేసింది. ప్రస్తుతం చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఎం,ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మర్చి మధ్యలో నుండి కరోనా కారణంగా సెలవులు ఇచ్చేసారు. ఆ తర్వాత జరగాల్సిన పరీక్షలని చాలా రాష్ట్రాలు రద్దు చేసి .. పై తరగతులకు ప్రమోట్ చేసాయి. కానీ , ఇప్పటికే ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావాల్సింది. కరోనా కారణంగా అది కుదరకపోవడంతో చాలా విద్యాసంస్థలు ఆన్ లైన్ భోదనకి మొగ్గుచూపి ..ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడం ప్రారంభించాయి.

అయితే , ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావడం లేదని 70% మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ఇంట్లో ఇంటర్ నెట్ సరిగా రాకపోవడం వల్ల క్లాసులు సరిగా వినలేకపోతున్నామని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. అలాగే ఆ మొబైల్ లో కొందరు క్లాసులు వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ముఖ్యంగా క్లాసులో అయితే , పక్కనే ఫ్రెండ్స్ ఉంటారు అదో అట్మాస్పియర్ ..కానీ ,ఆన్ లైన్ క్లాసుల్లో అయితే  టీచర్ పాఠం ‌ చెప్పినంత సేపు ఏకాగ్రతతో వినాలి. అలా చాలామంది ఏకాగ్రతతో వినలేకపోతున్నారు. అలాగే మరోవైపు వారికీ తల్లిదండ్రుల ఒత్తిడి కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. అంతంత  డబ్బులు పెట్టి మొబైల్  కొనిచ్చాం..ఖచ్చితంగా పాఠాలు వినండంటూ తల్లిదండ్రుల కొంతమంది పై ఒత్తిడి చేస్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో 70 శాతం మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. మరోవైపు పాఠాలయితే వింటున్నాం కానీ పరీక్షలు ఆన్‌ లైన్‌ లో ఎలా నిర్వహిస్తారో అనే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News