ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తోంది. గత నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 80 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోమవారం బులిటెన్ లో ప్రకటించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. అటు.. 235 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా ఎవ్వరూ చనిపోలేదు. యాక్టివ్ కేసులు సంఖ్య 911గా ఉంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 80 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని , తాజాగా గుంటూరులో 23, కృష్ణాలో 33, కర్నూలులో 13, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 1, పశ్చిమ గోదావరిలో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో కర్నూల్ టాప్‌లో ఉంది. ఆ జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరులో 237 కేసులు నమోదయ్యాయి. ఇక కృష్ణా జిల్లా కూడా 200 కేసులు దాటింది. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.