13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

Update: 2021-01-17 14:06 GMT
కామంతో కళ్లు మూసుకుపోయిన 9 మంది కామాంధులు విచక్షణ మరిచి 13 ఏళ్ల బాలికపై ఘోరాతి ఘోరానికి పాల్పడ్డారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా రెండు సార్లు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. మొదటి సారి బెదిరించి ఊరుకున్న అమ్మాయి రెండోసారి మాత్రం జరిగిన దారుణంపై రోడ్డెక్కింది.

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 9మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది. బాలికను రెండు సార్లు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.

మధ్యప్రదేశ్ లోని ఉమారియాకు చెందిన  9మంది మృగాళ్లు 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి జనవరి 4న నిర్మానుష్య ప్రదేశానికి  తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఇంటికి పంపించారు. మళ్లీ 11న బాలికను ఎత్తుకెళ్లి మరోసారి గ్యాంగ్ రేపు చేశారు. దీంతో బాలిక , కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.
Tags:    

Similar News