తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్.. 2022-23లో సంప్రదాయాలకు ముగింపు పలికారని అంటున్నారు ఆర్థిక పరిశీలకులు. దీనిలో సంప్రదాయంగా ఎక్కడా కేటాయింపులు చేయలేదు. కేంద్రీకృత పెట్టుబడు లకు కేటాయించారు. సుదీర్ఘ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా గిఫ్ట్ సిటీ పేరుతో కేటాయింపులు ఎక్కువగా ఇచ్చారు. వాస్తవానికి ఇప్పటి వరకు.. గిఫ్ట్ సిటీ ఒక్క గుజరాత్‌లోనే ఉంది. అంటే.. గుజరాత్ తరహాలో ఇతర రాష్ట్రాలు గిఫ్ట్ సిటీలు.. ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది. లేకపోతే... ఒక్క గుజరాత్‌కే కేటాయింపులు జరిగే అవకాశం ఉంటుంది.
అదేసమయంలో సంప్రదాయంగా అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు ఉంటాయి. కానీ, ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు. అన్ని రాష్ట్రాలక కలిపి కేవలం లక్ష కోట్లతో ననిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని నుంచి 50 ఏళ్లపాటు.. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామన్నారు. అంటే.. ఇక నుంచి.. రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇచ్చే నిధులు లేవు. ఇచ్చినా.. అప్పుల రూపంలోనే ఇవ్వనున్నారు. పైగా.. సాంకేతికతకు పెద్దపీట వేశారు. సాంకేతిక రంగంలో భారీ ఎత్తున డ్రోన్లకు పెట్టుబడులు ఇస్తామన్నారు.
అదేసమయంలో ఉద్యోగాల కల్పనను పూర్తిగా బడ్జెట్‌లో పక్కన పెట్టారు. దేశంలో ఉద్యోగాలకు ప్రాధాన్యం కాకుండా.. యువతను పారిశ్రామిక రంగాల వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. ఇది మంచిదే అయినా.. అందరూ పారిశ్రామికం వైపు మళ్లుతారా? చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తారా? అనేది సమస్య. ఇది కూడా రుణాలు తీసుకునేపరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఎక్కడా ఉద్యోగుల ఆదాయ పన్నును మినహాయించ లేదు. అంటే.. పన్నుల విషయంలో ప్రజల నుంచి పిండుకునేందుకే ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది.
మరోవైపు.. డిజిటల్ కరెన్సీ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపైనా పన్నుల మోత మోగించా రు. ఇక, క్రిప్టో కరెన్సీ పైనా 30 శాతం పన్నులు వేశారు. ఇది ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉందనే భావన వ్యక్తం చేశారు ఇక, విదేశీ విద్యా సంస్థలను దేశంలోకి తీసుకురావడం వల్ల.. దేశీయంగా ఉన్న.. విద్యాసం స్థల బలోపేతానికి ప్రభుత్వం నీళ్లు వదిలేసిందనే వాదన వినిపిస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగానికి కూడా కేటాయింపులు లేకపోవడం గమనార్హం. ఇక, విద్యకు కూడా కేటాయింపులు లేకపోవడం మరింత నిరాశ పరిచింది. ఇక, పేదలకు.. ఎలాంటి ప్రయోజనాలు కల్పించేలా చేయలేదు. ముఖ్యంగా కరోనా సమయంలో దెబ్బతిన్న పరిశ్రమలకు, ఉపాధికి, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని నిపుణులు చెబుతున్నారు.