కరోనా సెకండ్ వేవ్ తో దేశ ఆర్థికవృద్ధికి పెను విఘాతం కలుగుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాము తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.కరోనా పరిస్థితి మెరుగుదలను బట్టి ఆర్థికవృద్ధి కోసం మేం చర్యలు చేపడుతామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు పలు ప్రతిపాదనలను రూపొందించిందన్నారు.
దేశంలో లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించిన నేపథ్యంలో దీని ప్రభావం ఆర్థికవృద్ధిపై పడిందని.. పరిస్థితి కోలుకోవడానికి మళ్లీ కొన్ని నెలలు పట్టవచ్చని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు.పెట్టుబడులు తగ్గడం.. మాంద్యం వంటి పరిణామాలు సాధారణ పరిస్థితి పునరుద్ధరణకు రిస్క్ గా మారాయని దాస్ తెలిపారు.
దేశ ఆర్థికవృద్ధి రేటును గాడినపెడుతున్న ఈ సమయంలో మరోసారి సెకండ్ వేవ్ పెరిగిపోవడం పెను సవాల్ గా మారిందని శక్తికాంత్ దాస్ చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులు సైతం మళ్లీ ఇప్పుడు తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తున్నారని ఆయన చెప్పారు.ఈ కరోనా వేవ్ తో ద్రవ్యల్బోణం అదుపులో పెట్టాలంటే మరిన్ని చర్యలు చేపట్టాలని.. ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపి కోవిడ్ ప్రభావం తగ్గాక దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.