ఈ ప్రపంచంలో తల్లి , బిడ్డల ప్రేమకి మరొకటి సాటిరాదు, లేదు. కానీ , ప్రస్తుత రోజుల్లో డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులకి కొడుకు అన్నం కూడా పెట్టడం లేదు ..భార్య వచ్చిన తరువాత కని , పెంచిన తల్లిదండ్రులు కూడా బరువైపోతున్నారు అని , కంటే కూతుర్నే కనాలి అంటూ పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు. నేటి రోజుల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది ..ఏమిటంటే ..కొడుకు అయితే తల్లితండులకి కూడు పెట్టడు , అదే కూతురు అయితే తల్లిదండ్రులని కంటికిరెప్పలా చూసుకుంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయని భావిస్తున్నారు. కానీ , తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే కూతురు కంటే కొడుకే నయం అని అంటారేమో...
తండ్రి చనిపోయాడు అనే భాద లేకుండా , తల్లికి వచ్చే చంద్రన్న భీమని కాజేయాలని ,బతికున్న తల్లి చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఈ నిర్వాకానికి చంద్రన్న భీమా సిబ్బంది కూడా సహకారం అందించడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట లో జరిగింది.
దీనిపై పూర్తి వివరాలు చూస్తే ...రాజంపేట పట్టణంలోని బలిజపల్లి చెందిన ఆదిలక్ష్మమ్మ వెంకటరత్నం దంపతుల కుమార్తె శాంతకుమారి. గతేడాది నవంబర్ 14 వ తేదీన వెంకటరత్నం మృతిచెందాడు. వెంకటరత్నం చంద్రన్నభీమా లో సభ్యుడు కావడంతో ఆ భీమా సొమ్ము కాజెయ్యాలని భావించిన కుమార్తె నామినీగా తల్లి ఉండాల్సిన స్థానంలో తన పేరును మార్చుకుంది. ఇక తన తల్లి ఆదిలక్ష్మమ్మ చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఇందుకు చంద్రన్న భీమా సిబ్బంది కూడా శాంతకుమారికి సహకరించారు. అయితే , ఇటీవలే తనకు బియ్యం కార్డు, పింఛను ఇవ్వాలని ఆదిలక్ష్మమ్మ మున్సిపాలిటీ కార్యాలయంకి వెళ్లగా , జరిగిన విషయం తెలుసుకొని , డబ్బు కోసం కూతురు చేసిన నిర్వాకం విని గుండెలవిసేలా ఏడ్చింది ఆదిలక్ష్మమ్మ.
అసలు భీమా సిబ్బంది ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే తను చనిపోయానని ఎలా ధృవీకరిస్తారు అని ఆమె అధికారులు నిలదీసింది. అంతేకాదు ఈ నిర్వాకం పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఏదేమైనా కేవలం భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని సైతం చచ్చిపోయింది అని రికార్డ్స్ సృష్టించిన ఆ కూతురు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే , లేకపోయినా ఒకటే అని చెప్తున్నారు. ఈరోజుల్లో ఇలాంటి కూతుర్లు ఉండటం అత్యంత బాధాకరమైన విషయం.