ఆన్ లైన్ క్లాసుల కష్టాలు ... మొక్కజొన్న తోటలో మంచంపై అమ్మాయి చదువు !

Update: 2020-09-15 13:30 GMT
కూటి కోసం కోటి కష్టాలు అన్నది పాత సామేత ... కరోనా తప్పించుకుంటే చాలు అనేది కొత్త సామేత. ఈ కరోనా కాలంలో అందరికి అనేక ఇబ్బందులు ఎదురైయ్యాయి. ముఖ్యంగా విద్యార్ధులకి అన్ని సమస్యలే. ఆడుతూ పాడుతూ తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలలో గడుపుతూ చదువుకునే అవకాశం లేకుండా చేసింది. అయితే ప్రభుత్వం విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ తరగతులను ప్రారంభించింది. దూరదర్శన్, టిశాట్ ద్వారా తరగతులను బోధిస్తున్నారు. ఇప్పుడు ఇదే అందరికి పెద్ద సమస్యగా మారింది.

వివరాల్లోకి వెళ్తే ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో విద్యుత్ కోత ఒక సమస్య అయితే కొందరి వద్ద స్మార్ట్ ఫోన్ లేక, మరికొందరు స్మార్ట్ ఫోన్ ఉన్నా సరైన సిగ్నల్స్ లేక ఆన్ లైన్ తరగతులను వినలేకపోతున్నారు. సెల్ సిగ్నల్ కోసం చెట్ల వెంట, గుట్టల వెంట పరుగెడుతున్నారు. ఇదిలా ఉంటె నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలోని ఓ విద్యార్థిని చేనులోని మంచె పై కూర్చోని ఆన్లైన్ లో క్లాసులు వింటుంది. అయితే , ఆ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి సెల్ టవర్ పనిచెయ్యడం లేదు. అయితే, నిర్మల్ ‌లో మైనారిటి గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న రాజూరా గ్రామానికి చెందిన సాఫా జరీనా అనే విద్యార్థిని ఇంటి దగ్గర ఫోన్ సిగ్నల్ రావడం లేదని ఊరు చివర్లో ఉన్న మొక్క జొన్న తోటలో మంచె పైన కూర్చొని ఆన్లైన్ లో క్లాసులు వింటుంది.

పొలంలో ఉండే మంచెపై కూర్చుంటేనే సెల్ సిగ్నల్ వస్తోంది. దీనికోసం ప్రతి రోజూ తన తండ్రిని తీసుకొని మొక్క జొన్న తోటకు వచ్చి మంచె పైన కూర్చొని ఆన్ లైన్ లో క్లాసులు వింటుంది. ఊళ్లో సెల్ టవర్ సిగ్నల్ లేక ఆన్లైన్ క్లాస్లులకు ఇబ్బంది పడుతున్నమని విద్యార్థిని సాఫా జరీనా చెబుతోంది. కలెక్టర్, మంత్రి చొరవ తీసుకొని గ్రామానికి సెల్ సిగ్నల్ వచ్చేలా చేసి విద్యార్థుల ఇబ్బందులను దూరం చేయాలని కోరుతోంది. వ్యవసాయం చేసుకొని జీవనోపాధి పొందుతున్న తాను ప్రతి రోజు ఊరి చివర ఉన్న మొక్కజొన్న తోట వద్దకు కూతురును తీసుకువెళ్ళి, తరగతులు అయిపోయే వరకు కాపాలా ఉండి తరగతులు ముగిసిన తర్వాత తీసుకు వస్తున్నానని షేక్ శాకీర్ కోరుతున్నాడు.
Tags:    

Similar News