యూపీలో మరో దారుణం: 18 ఏళ్ల యువతిపై రేప్, హత్య

Update: 2020-10-16 17:30 GMT
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికే హత్రాస్ జిల్లాలో ఓ దళిత బాలికను నలుగురు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దళిత సంఘాలు, ప్రతిపక్షాలు దీనిపై ధ్వజమెత్తాయి. ఆ సంఘటన మరిచిపోకముందే యూపీలో మరో దారుణం వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్ లో మరో హత్యాచార ఘటన కలకలం రేపింది. బారాబంకిలో బుధవారం రాత్రి ఓ 18 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గొంతుకోసి హత్య చేశారు.

పొలం పనులకు వెళ్లిన కుమార్తె ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో దళిత యువతి పడి ఉంది. పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.ఆ తర్వాత హత్య చేసినట్లు తెలిపారు.

వరుసగా రెండో దళిత యువతిని కూడా అత్యాచారం చేసి చంపడం.. యూపీలో కలకలం రేపింది.దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. అధికార యోగి సర్కార్ పై దుమ్మెత్తిపోశారు. స్థానికులు దళిత యువతి శవంతో బారాబంకిలో ఆందోళన చేపట్టారు.
Tags:    

Similar News