అయ్యో అనిపించే విషాదం.. భార్యపిల్లలకు విషమిచ్చి తాను ఊరి వేసుకున్న వ్యాపారి
అయ్యో అనిపించే విషాదం ఒకటి నిజామాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. భార్య ఇద్దరుపిల్లలతో నిజామాబాద్ లోని ఒక హోటల్ లో ఈ నెల 4 నుంచి బస చేశాడు. తాజాగా భార్యా.. పిల్లలకు విషమిచ్చి తాను ఉరి వేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. గడిచిన రెండున్నర వారాలుగా చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇళ్లకు రోజూ వెళ్లి వస్తున్న వారు.. విగతజీవులుగా మారిన వైనం షాకింగ్ గా మారింది.వ్యాపార లావాదేవీల్లో భాగంగా చోటు చేసుకున్న ఒత్తిళ్లతోనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 37 ఏళ్ల కొత్తకొండ సూర్య ప్రకాశ్. ఆయన భార్య 36 ఏళ్ల అక్షయ. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరు 11 ఏళ్ల ప్రత్యూష.. రెండో వారు ఏడేళ్ల అద్వైత్. నిజానికి వీరి సొంతూరు అదిలాబాద్ లోని బుక్తాపూర్ కాలనీ. అదిలాబాద్ పురపాలక సంఘం టీఆర్ఎస్ పక్ష నేత బండారి సతీశ్ కు ఇతను దగ్గరి బంధువు. ఐదేళ్ల క్రితం వరకు అదిలాబాద్ లోనే ఉండి.. పెట్రోల్ బంక్ వ్యాపారం చేసేవారు. తర్వాత ఆస్తులన్ని అమ్మేసి హైదరాబాద్ కు షిప్టు అయిపోయారు. రాయదుర్గంలో ఖరీదైన అపార్ట్ మెంట్ కొనుక్కొని అక్కడే స్థిరపడ్డారు.
నిజామాబాద్ లో ఎక్కువ మంది బంధువులు ఉండటంతో తరచూ ఇక్కడకు వచ్చేవారు. తాజాగా ఈ నెల నాలుగున తన కారుతో నిజామాబాద్ కు వచ్చి స్థానిక హోటల్లో ఉంటున్నారు. శనివారం సాయంత్రం నుంచి వారు బయటకు రాకపోవటం.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా.. గదిలో ఎలాంటి అలికిడి లేకపోవటంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమక్షంలో హోటల్ గది తలుపులు తెరవగా.. భార్యా.. పిల్లలు బెడ్ మీద పడిపోయి ఉండటం.. సూర్యప్రకాశ్ ఉరి వేసుకున్న వైనం కనిపించింది.
విషం సేవించి ఉంటే.. దానికి సంబంధించిన బాటిల్ ఉండాలి. కానీ.. అలాంటిదేమీ లేదు కానీ.. కేకులు కొన్ని ఉండటం చూస్తే.. వాటిల్లోవిషం కలుపుకు వచ్చి వారి చేత తినిపించటంతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
వ్యాపారంలో భాగస్వామ్యులతో వచ్చిన విభేదాలతో ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. చెక్కులు.. ప్రామిసరీ నోట్లు రాయించుకొని స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం.. మరింత డబ్బు కావాలని వేధించటంతో .. ఇవ్వకుంటే చనిపోవాలని బెదిరించటంతో సూసైడ్ చేసుకున్నట్లుగా ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. తన మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సూర్యప్రకాశ్ కోరారు.
ఆత్మహత్యలకు ముందు రాసిన లేఖలో ఉన్న పేర్లను పోలీసులు వెల్లడించలేదు. అయితే.. సూర్యప్రకాశ్ ను బెదిరించిన వారిలో ఒకరికి పోలీసు అధికారి బంధువు ఉండటం.. అతని సాయంతో సూర్యప్రకాశ్ ను బెదిరించారని చెబుతున్నారు. పదిహేను రోజులక్రితం హైదరాబాద్ లో సూర్యప్రకాశ్ పై కొందరు దాడి చేశారని ఒక బంధువు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా నిజామాబాద్ లో ఉంటూ దేవాలయాలు చూస్తూ.. బంధువుల ఇళ్లకు వచ్చి భోజనం చేసిన వారు ఇంతలో ఇలా జరగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సూర్యప్రకాశ్ కోరుకున్నట్లేవారి ముగ్గురికి నిజామాబాద్ లోనే అంత్యక్రియల్ని పూర్తి చేశారు.