చిత్రం చూశారా.. వైన్ షాపు ముందు పూజలు!
దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా లాక్ డౌన్ అమలవుతుండటంతో దేశవ్యాప్తంగా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. వైన్ షాపులన్నీ బంద్ అయిపోవడంతో మద్యం దొరక్క నానా తంటాలు పడుతున్నారు. ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్లు ఏదో ఒక మార్గంలో మందు తెప్పించుకుంటున్నారు కానీ.. సామాన్య మందు బాబుల పరిస్థితే చాలా కష్టంగా ఉంది. రోజూ మందు కొడితే తప్ప బతకలేని ఎంతోమందికి పిచ్చెక్కి పోతోంది. మద్యం తాగక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వాళ్లు.. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇంకొంతమందేమో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిస్తూ ప్రకటన చేసింది. మే 3 తర్వాత గ్రీన్ - ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రకటించింది. రెడ్ జోన్లలో సైతం కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మందు బాబుల ఆనందం అంతా ఇంతా కాదు. వారి సంతోషానికి అద్దం పట్టే ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో చోటు చేసుకుంది. కుప్పం సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంగారు పేటలో ఒక మద్యం షాపు ముందు మందు బాబు పూజలు నిర్వహించాడు. సోమవారమే ఈ వైన్ షాపు తెరుచుకునే అవకాశం ఉండటంతో అతను కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చాడు. ఆలయంలో దేవుడికి పూజ చేసినట్లు మద్యం దుకాణం ముందు ఇలా చేయడంతో జనం విస్తుబోయి చూశారు. వైన్ షాపులు తెరుచుకుంటుండటం మందు బాబుల్లో ఎంత ఆనందాన్ని కలిగిస్తోందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఐతే నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకుంటే ఒక్కసారిగా జనం ఎగబడే అవకాశముంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల ముందు బారికేడ్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజ్ చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మందు అమ్మకాలు జరపాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.