రిటైర్మెంట్ ను చెత్తబుట్టలో వేసి.. మళ్లీ వచ్చేస్తానంటున్న క్రికెట్ ఛాంపియన్!
ఛాంపియన్ అనే హోదాకు సంపూర్ణ అర్హుడు ఏబీ డివిలియర్స్. మైదానంలో 360 డిగ్రీస్ లో షాట్లు అడగల సత్తాకలిగిన అతికొద్ది మంది ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉంటాడు ఏబీ. అతని ఆటను ఆస్వాదించే అభిమానులు సౌతాఫ్రికాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ 2018లో రిటైర్మెంట్ ప్రకటించాడు డివిలియర్స్.
'నేను ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాను. ఇక, నా కుటుంబానికి సమయం కేటాయించాలని అనుకుంటున్నాను' అని రిటైర్మెంట్ వేళ ప్రకటించాడు. నిజానికి రిటైర్మెంట్ అంటే.. వయసుపైబడిన వారు, సరైన ప్రదర్శన చేయలేనివారు ఆటకు ఇచ్చే విరామం. కానీ.. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. కావాల్సినంత వయసు ఉండి కూడా.. రిటైర్ అయ్యాడు ఏబీ.
డివిలియర్స్ శాశ్వత గైర్హాజరీతో దక్షిణాఫ్రికా జట్టు మూల స్తంభాన్ని కోల్పోయిందని చెప్పొచ్చు. మరి, జట్టుకోసం మనసు మార్చుకున్నాడా? వ్యక్తిగత ఆలోచనేనా? అన్నది తెలియదుగానీ.. మళ్లీ జాతీయ జట్టుకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు డివిలియర్స్. ఇప్పటికే కోచ్ బౌచర్ తో మట్లాడానని, మరోసారి మాట్లాడుతానని చెప్పాడు. జాతీయ జట్టుకు ఆడడానికి కావాల్సినంత ఫిట్ గా ఉన్నానని చెప్పాడు. అన్నీ కుదిరితే త్వరలో భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా తరపున ఆడుతానని చెప్పాడీ విధ్వంసక బ్యాట్స్ మెన్.
అయితే.. ఇదే మాట మరో ఆటగాడు ఎవరైనా అని ఉంటే.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఊహించగలం. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకునేదానికి.. మళ్లీ మైదానంలోకి ఎందుకు? అనేవారు. కానీ.. వస్తానంటున్నది డివిలియర్స్. అతని సత్తా ఏంటన్నది క్రికెట్ ప్రపంచానికి తెలుసు. అందుకే.. అభిమానులంతా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. 'నువ్వొస్తానంటే.. మేమొద్దంటామా?' అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.