'మైక్రోసాఫ్ట్ అధినేత సత్యా నాదెళ్ల ను ఇంజినీరింగ్ లో చేరమన్నది నేనే.. గాంధీజి కి ఉప్పు సత్య గ్రహం చేయమన్నది నేనే. ఇక దిగ్గజ బడ్మింటన్ క్రీడాకారుల కు రాకెట్ పట్టించింది నేనే.. హైదరాబాద్ ను కట్టింది నేనే' ఇలా చంద్రబాబు నోటి నుంచి జాలివారిన ఆణి ముత్యాలు ఎన్నో.. అయితే అవన్నీ చేశాడో లేదో తెలియదు కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకున్నారు బాబు గారు. తాజాగా మరో సంచలన విషయాన్ని కూడా బయట పెట్టారు.
దివంగత రాష్ట్రపతి అబ్ధుల్ కలాం తన దగ్గర నేర్చుకున్నారని చంద్ర బాబు సంచలన కామెంట్ చేశారు. తాను సీఎం గా ఉన్నప్పుడు రూపొందించిన విజన్-2020 గురించి తెలుసుకొని .. ఆ విజన్ పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్ పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారని చంద్ర బాబు చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా మామండూరు లో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఈ హాట్ కామెంట్ చేశారు.
అబ్దుల్ కలాం మే చంద్రబాబు విజన్ ను కొట్టారంటే నమ్మశక్యంగా లేకున్నా బాబు చెప్పారు కాబట్టి నమ్మి తీరాల్సిందే.. అయితే దీన్ని ధృవీ కరించడానికి కలాం బతికి లేక పోవడమే మన దుర దృష్టం.
ఇక తానే అగ్రిగోల్డ్ బాధితుల కు పరిహారం చెల్లిద్దామని అనుకున్నానని.. కానీ నాడు ఎన్నికల కోడ్ వల్ల సాధ్యం కాలేదని బాబు చెప్పుకొచ్చాడు. తాను వదిలేసిన ఇప్పుడా అదృష్టం జగన్ కు దక్కిందని బాబు చెప్పుకొచ్చాడు. పసుపు కుంకుమ వరాలకు కోడ్ ఉన్నా పంచిన చంద్ర బాబు అగ్రి గోల్డ్ బాధితులకు మాత్రం కోడ్ సాకుగా చూపడం ఏంటని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలన్న తన కోరిక నెరవేరలేదని.. ఆ అదృష్టం తనకు లేదని బాబు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే సంగతి చూస్తా అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మీరూ రోడ్ల పైకి వచ్చే రోజు వస్తుందని.. అప్పుడు మీ సంగతి తేలుస్తానంటూ బాబు బెదిరించడం విశేషం.