డాలర్ డ్రీమ్స్ కావొచ్చు. ఇతర అవసరాలకు యూఎస్ వెళ్లాలని భావించే వారికి పెద్దతలనొప్పిగా మారుతోంది వీసా స్లాట్ వ్యవహారం. భారీ వెయిటింగ్ ఉన్న నిరీక్షణ జాబితాను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లుగా ఆమెరికా విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికా వీసాల కోసం వెయిట్ చేస్తున్న భారతీయులకు తాజాగా ఒక ఉపశమన వివరాల్ని వెల్లడించారు. యూఎస్ కౌన్సిలర్ అఫైర్స్ బ్యూరోలో వీసాల జారీ విభాగంలో పని చేసే ఉన్నతాధికారి జూలీ స్టఫ్ స్పందించారు.
వీసాల వెయిటింగ్ పిరియడ్ ను తగ్గించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గత అక్టోబరులో బిజినెస్ (బీ1).. పర్యాటక (బీ2) వీసాల వెయిటింగ్ పిరియడ్ ను తగ్గించే ప్రయత్నాలు ఎక్కువైనట్లు పేర్కొన్నారు. వెయిటింగ్ పిరియడ్ ను తగ్గించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కొవిడ్ ముందునాటి పరిస్థితుల్ని తీసుకురావాలన్నదే తమ ప్రయత్నంగాపేర్కొన్నారు.
ఇండియాతో పాటు జర్మనీ, థాయ్ లాండ్ లోనూ భారతీయుల వీసా జారీ కోసం ఎంబసీలు.. కాన్సులేట్ లకు మరింత మంది సిబ్బందిని పంపుతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో..వీసా వెయిటింగ్ పిరియడ్ తగ్గి.. వీలైనన్ని స్లాట్లు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. హెచ్ 1బీ..
ఎల్ 1 వీసాల వెయిటింగ్ పిరియడ్ ను ఏడాదిన్నర నుంచి రెండు నెలలకు కుదించారని.. రానున్న రోజుల్లో మరింత సులువుగా వీసా వెయిటింగ్ ప్రక్రియ తగ్గుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. భారతీయులకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది చెప్పండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.