విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏడాది క్రితం మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత అడపాదడపా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో టచ్ లో ఉంటూనే ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా పార్టీ పెడితే.. పొలోమంటూ వెళ్లి జాయిన్ అయిపోతారు. కానీ కమల్ పార్టీలో చెప్పుకోదగ్గ ప్రముఖులు ఎవ్వరూ చేరలేదు. దానికి కారణం.. అప్పుడు ఎన్నికల సమయంలో కాకపోవడమే. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసింది కదా. అందుకే.. ఇప్పుడు కమల్ పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. లేటెస్ట్ గా సీనియర్ నటి, స్టార్ కమెడీయన్ కోవై సరళ కమల్ హాసన్ పార్టీలో చేరారు. కమల్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. లేదంటే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని రొటీన్ సినిమా డైలాగులు చెప్పేశారు.
కోవై సరళ గురించి మనం ఇక్కడో విషయం ప్రస్తావించాలి. కమల్ స్టార్ హీరోగా ఉన్న టైమ్ లో సతీ లీలావతి అనే సినిమాలో అవకాశం వచ్చింది కోవై సరళకు. అందులో కమల్ భార్య. అప్పుడు ఆమెకున్న హోదాకు కమల్ పక్కన చిన్న వేషం వెయ్యడమే ఎక్కువ. అలాంటిది కమల్ పక్కన భార్య పాత్ర అనగానే ఎగిరి గంతేసింది. అద్భుతంగా చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే.. సతీ లీలావతి అనగానే అందరికి కోవై సరళ గుర్తుకువస్తుంది కానీ.. కమల్ హాసన్ గుర్తుకురాడు. తెలుగు, తమిళ భాషల్లో రెండు చోట్లా సతీ లీలావతి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పార్టీలో ఇద్దరూ కలిసి ఎన్నికల కోసం కదన రంగంలోకి దూకబోతున్నారు. కోవై సరళకు తమిళనాట మంచి పేరుంది. టిక్కెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తుందనే ప్రచారం ఉంది. మరోవైపు సినిమా వాళ్లంతా కమల్ పార్టీలోకి వస్తున్నారు. ఎన్నికల ముందు లోక్ సభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రజనీకాంత్ ప్రకటన చేయడంతో.. ఇప్పుడు రజనీ పార్టీవైపు చూసేవాళ్లు కూడా ఎవ్వరూ లేరు.