కొద్ది నెలల క్రితం మేఘాలయ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ....రూ.70 వేల ఖరీదైన జాకెట్ ధరించి రావడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే తరహాలో ప్రధాని మోదీ ధరించిన జాకెట్ పై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మోదీపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ - బహుబాష నటి రమ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ గారు ధరించిన లోరో పియానా జాకెట్ తనకు నచ్చిందని, దాని ధర కేవలం 17,000 యూరోలు మాత్రమేనని రమ్య సెటైర్ వేస్తూ ట్వీట్ చేవారు. అయితే, ఆ ట్వీట్ చేసిన రమ్యకు బీజేపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో రిటార్ట్ కూడా ఇచ్చారు. గతంలో రాహుల్ ధరించిన జాకెట్ కు డబ్బు ఎవరు చెల్లించారో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.
2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయినన మోదీ రూ. 11 లక్షల ఖరీదైన సూట్ ధరించడంపై కాంగ్రెస్ , ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ సూట్ వేలం వేయగా రూ. 4.31 కోట్లు వచ్చాయి. ఆ సమయంలో మోదీది....`సూటు బాటు సర్కారు’ అంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. దానికి ప్రతీకారంగా అప్పట్లో రాహుల్ ధరించిన ఖరీదైన జాకెట్ పై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే మోదీని రమ్య టార్గెట్ చేశారు. మోదీ ధరించిన జాకెట్ కేవలం 17,000 యూరోలు అని, అది చాలా చీప్ (తక్కువ ధర) అని ఎద్దేవా చేశారు. ఆ జాకెట్ ను ఎవరి క్రెడిట్ కార్డు వాడి తీసుకున్నారో చెప్పాలని ట్వీట్ చేశారు. అయితే, దీనికి బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతికి ఉన్న రూ. 70 లక్షల విలువైన హుబ్లో వాచ్ - రాహుల్ ధరించిన జాకెట్ విలువ ఎంతో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, వాటిని ఎవరి అకౌంట్ లో తీసుకున్నారు కాస్త వివరించండి మేడమ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా, రమ్య-బీజేపీ నేతల ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.