ఉగాది రోజున పొద్దున్నే ఉగాది పచ్చడికి ఎంత ముఖ్యమో.. పండితుల చేత పంచాంగ శ్రవణం అంతే ముఖ్యం. గతంతో పోలిస్తే పంచాంగ శ్రవణంలో చాలానే మార్పులు వచ్చేశాయి. మొహమాటాలు ఎక్కువైపోయాయి. అందుకే నిజాల కంటే కూడా.. అప్పటికి నడిచిపోయే మాటలు వినిపించటం మామూలుగా మారింది. అయితే.. ఈ ఏడాది పంచాంగ శ్రవణంలో ఒక సంచలన వ్యాఖ్యానం వినిపించింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇటీవల మరణించిన నటి శ్రీదేవిది హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీదేవిని ఆమె సన్నిహితులే చంపారన్న మాటను చెప్పారు. ఈ వ్యాఖ్య కూడా ఏదో ఒక ప్రైవేటు సభలో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఉగాదిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీదేవి మరణంపై ఊహించని రీతిలో వ్యాఖ్య చేసిన ములుగు సిద్ధాంతి.. ఈ ఏడాది డిసెంబరులోపు ఎన్నికలు నిర్వహిస్తే మోడీకి అనుకూల ఫలితాలు వస్తాయన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్‌కు విజయం పక్కా అని చెప్పారు.
మూడో ఫ్రంట్ ప్రాధాన్యతను సంతరించుకుంటుందని.. గుజరాత్.. రాజస్థాన్.. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. ఉత్తరప్రదేశ్.. ఒడిశా.. బిహార్ లలో బీజేపీ సీట్లు సగానికి సగం తగ్గుతాయన్నారు. సీమాంధ్ర.. తెలంగాణలో బీజేపీ ఒక్క లోక్ సభ సీటును కూడా గెలవలేదన్నారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాల్లో రాణిస్తారంటూ భారీ విశ్లేషణే చేశారు. అందరిని టచ్ చేసిన ములుగువారు.. పవన్ ను మిస్ అయినట్లుగా కనిపిస్తుందే? ఎవరికి అర్థం కానట్లు ఉంటారంటూ పవన్ ను విమర్శించే వారికి తగ్గట్లే.. ములుగు వారికి సైతం పవన్ ఒక పట్టాన అర్థం కాలేదా ఏంటి?