హిల్లరీ గెలిస్తే ఓకే.. మరి ట్రంప్ గెలిస్తే..?

Update: 2016-11-07 11:30 GMT
ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఎవరూ సిద్ధంగా లేరనే చెప్పాలి. పైకి ఎంత పోటాపోటీగా సాగుతుందని చెప్పినా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆమే అమెరికా అధ్యక్షురాలిగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు అమెరికా మీడియా సైతం హిల్లరీకే విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం.. ట్రంప్ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదన్న వాదనను గట్టిగా వినిపించే వారు చాలామందే కనిపిస్తారు.

అందరూ అంచనా వేస్తున్నట్లు హిల్లరీ కానీ విజయం సాధిస్తే ఓకే. మరి.. ఊహించని రీతిలో అమెరికన్లు రియాక్ట్ అయి తమ అధ్యక్షునిగా ట్రంప్ ను ఎన్నుకుంటే పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారటమే కాదు.. అలాంటిదే జరిగితే ఏమవుతుందన్న విషయంపై చేస్తున్న విశ్లేషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రంప్ గెలిస్తే మార్కెట్ పరంగా చోటు చేసుకునే పరిణామాలపై ఒక అంచనా చూస్తే..

= ట్రంప్ గెలుపుతో యూఎస్.. వాణిజ్య యుద్ధాలను.. దివాలాలను చూస్తుంది. ట్రంప్ గెలిస్తేనే కాదు..హిల్లరీ గెలిచినా ఇలాంటి పరిస్థితే. కానీ.. కాస్త ఆలస్యంగా..

= ట్రంప్ గెలిస్తే.. ముడిచమురు మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతంది.

= క్రూడాయిల్.. బంగారం ధరలు భారీగా పతనమవుతాయి.

= అమెరికాను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. అమెరికాలో ఎలాంటి పరిస్థితో చైనాలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశం ఉంది.

= కమోడిటీ మార్కెట్ అందనంత ఎత్తుకు చేరుతుంది.

= కొత్త పెట్టుబడులకు.. రిటైల్ ఇన్వెస్టర్లకు దీర్ఘకాల అవకాశాలు లభించే అవకాశం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News