విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే క్రైం స్టోరీ ఇది. ముగింపు విషాదమే అయినా.. ఇలాంటివి సాధ్యమేనా? అన్న సందేహం కలగటమే కాదు.. చుట్టూ ఉండే జనాలు ఇలా మారారేంటబ్బా అన్న భావన కలగటం ఖాయం. ఈ క్రైం స్టోరీని విన్నంతనే బాలీవుడ్ బిగ్రేడ్ సినిమాలు గుర్తుకు రాక మానవు. అహ్మదాబాద్ కు చెందిన 19 ఏళ్ల నిఖిల్ అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ చేసే ఈ కుర్రాడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్న విషయాన్ని అతడి సెల్ ఫోన్ చెప్పేసింది.
అతడి సెల్ ఫోన్.. ఆ తర్వాత పోలీసుల విచారణలో బయటకు వచ్చిన వాస్తవాలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. వెడ్డింగ్ డెకరేషన్ సప్లయి చేసే సంస్థలో జాబ్ లో చేరాడు నిఖిల్. పది నెలల తర్వాత ఇంటికి వచ్చిన అతడు తన తండ్రితో జాబ్ మానేస్తానని చెప్పాడు. ఆ తర్వాత యజమాని పిలుస్తున్నాడని చెప్పి వెళ్లిన అతగాడు మళ్లీ తిరిగి రాలేదు. మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడంటూ యజమాని నుంచి ఫోన్ తో నిఖిల్ కుటుంబం షాక్ తిన్నారు.
తర్వాత అతడి సెల్ ఫోన్ లోని విషయాలు.. పోలీసుల విచారణలో అవాక్కు అయ్యే నిజాలు బయటకు వచ్చాయి. 45 ఏళ్ల నిఖిల్ యజమాని.. పాతికేళ్ల తన భార్యను లవ్ చేయాలని.. ఆమెతో రిలేషన్ పెట్టుకోవాలని ఆదేశించాడు. యజమాని చెప్పినట్లు చేసిన నిఖిల్ ఆమెను ట్రాప్ చేయటమే కాదు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వరకూ వెళ్లింది.
అయితే.. ఆమెతో రిలేషన్ కట్ చేసుకోవాలని బెదిరించసాగాడు. మరోవైపు యజమాని భార్య అతడ్ని కోరుకోవటంతో ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు నిఖిల్. యజమానికి పంపిన ఒక మెసేజ్ లో.. మీ భార్యను ప్రేమించమని ఆదేశించారు. మీరు చెప్పినట్లే ఆమెను ప్రేమలో పడేశాను. ఇప్పుడామె నన్ను ప్రేమిస్తోంది. వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మాట మార్చి రిలేషన్ వదులుకోమంటున్నారు. నన్ను బెదిరిస్తున్నారు. జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారు. దయచేసి నన్ను మీ బానిసలా చూడొద్దు. దయ చూపండి అంటూ వేడుకున్న మెసేజ్ కనిపించింది. తన అవసరం కోసం నిఖిల్ ను ఇష్టారాజ్యంగా వాడుకున్న యజమాని.. చివరికి వారి వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.