గవర్నరా..? అయితే ఏంటట?

Update: 2015-12-23 09:54 GMT
 సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి - కేరళ గవర్నరు సదాశివంకు అనుకోని పరిస్థితి ఎదురైంది. కోచి నుంచి త్రివేండ్రంకు వెళ్లేందుకు మంగళవారం రాత్రి విమానాశ్రయానికి వెళ్లిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వెళ్లేటప్పటికి అక్కడ విమానం లేదు. ఆలస్యంగా రావడంతో ఆయన్ను విడిచిపెట్టి విమానం వెళ్లిపోయింది. అయితే... కేరళ రాజ్ భవన్ వర్గాలు మాత్రం అది గవర్నరును అవమానపర్చడమేనని ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటనపై ఎయిరిండియాకు ఫిర్యాదు చేయడానికి సదాశివం సిద్ధమవుతున్నారు.

మంగళవారం రాత్రి 9.20కి బయలుదేరాల్సిన విమానంలో ఆయన వెళ్లాలి. అయితే.. విమానం ఆలస్యమై షెడ్యూలు 11.40కి మారింది. గవర్నరు కూడా 11.28కే వచ్చేశారు. అయితే... అప్పటికే విమానం ఎక్కేందుకు ఉపయోగించే నిచ్చనను తొలగించేశారు. గవర్నరుకు ఎలాంటి చెకింగ్ లేకుండా పంపించొచ్చు కాబట్టి ఆయన్ను 11.28కి కూడా అనుమతించొచ్చు. అయినా, ఆయన్ను వదిలేసి 11.40కి విమానం గాలిలోకి ఎగిరింది. దీంతో షాక్ కు గురయిన సదాశివం చాలాసేపు మాట్లాడకుండా ఎయిర్ పోర్టులోనే అలా ఉండిపోయారు. ఎయిరిండియాపై కేసు వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News