లాక్ డౌన్ నుండి కేంద్రం ఇచ్చిన సడలింపులు నేపథ్యంలో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కూడా కేంద్రం సవరించింది. దాదాపుగా రెండు నెలల తర్వాత విమాన సర్వీసులు పునఃప్రారంభం కానుండటంతో ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయ విమానాల్లో టికెట్ ధరలు కనిష్టంగా రూ.3000 - గరిష్టంగా రూ.10వేలు ఉంటుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి తెలిపారు.
సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా.. విమానయాన సంస్థలకు మూడో వంతు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్రయాణికులకు ఎలాంటి ఆహారం అందజేయరాదని - తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. మార్గదర్శకాల ప్రకారం.. విమాన ప్రయాణికులకు భౌతికదూరం - ఆరోగ్య సేతు యాప్ - థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరని పేర్కొంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లోకి వెళ్లడానికి ముందు థర్మల్ స్క్రీనింగ్ జోన్ లో నుంచి ప్రవేశించాలని సూచించింది. ఆరోగ్య సేతు యాప్ ఉండాలని తెలిపారు.
విమాన ప్రయాణాన్ని మొత్తం ఏడు కేటగిరీలుగా విభజించారు.. 0 నుంచి 30 నిమిషాలు.. 30 నుంచి 60 నిమిషాలు - 60 నుంచి 90 నిమిషాలు - 90 నుంచి 120 నిమిషాలు - 120 నుంచి 150 నిమిషాలు - 150 నుంచి 180 నిమిషాలు - 180 నుంచి 210 నిమిషాలు.. ఉదాహరణకు ఢిల్లీ-ముంబయి విమానం కనీస టిక్కెట్ ధర రూ.3,500 - గరిష్ఠంగా రూ.10,000గా ఉంటుంది.. ఇవి మూడు నెలల పాటు అమలులో ఉంటాయి అని పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఢిల్లీ- ముంబయి నడిచే విమానం సామర్ధ్యంలోని 40 శాతం సీట్లను తక్కువ ధరకు - 50 శాతం సీట్లను రూ.6,700గా ఉండాలని సూచించారు.