అజిత్ ముచ్చట మొత్తం మసాలానేనా?

Update: 2016-12-08 08:53 GMT
అందుబాటులోకి వచ్చేసిన సరికొత్త సాంకేతికత పుణ్యమా అని.. ఇప్పుడన్ని విషయాలు వార్తలుగా మారిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే.. మీడియాను సైతం ప్రభావితం చేస్తున్న పరిస్థితి. ఇంతలా చెలరేగిపోతున్న సోషల్ మీడియాలో వస్తున్న సమచారాం ముందు వెనుకా లేకున్నా.. దానికో లాజిక్ చెప్పుకుంటూ వార్తల్ని వండేస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువైంది. కొన్ని సందర్భాల్లో అయితే..సోషల్ మీడియాలో వచ్చే విపరీతపు ప్రచారాల్ని వార్తలుగా ముద్రవేసి.. బండి లాగిస్తున్న బాపతు వెబ్ సైట్ల గోల కూడా ఎక్కువగానే ఉంది.

షాకింగ్ విషయం ఏమిటంటే.. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వెబ్ సైట్లు సైతం.. ఇష్టారాజ్యంగా వార్తలు ఇచ్చేస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుండా వార్తలు ఇచ్చేయటం.. అనంతరం వాటిని తొలగించుకోవటం లాంటివి చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాత్రి11.30గంటలకుమరణించినట్లుగా అధికారిక పత్రాలు సైతం చెబుతుంటే.. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆమె మరణించినట్లుగా కొన్ని ప్రముఖ సైట్లు అమ్మ మరణించినట్లుగా వార్తలు ఇచ్చేశాయి.

దీంతో.. అపోలో వైద్యులు తెర మీదకువచ్చి.. అమ్మ చనిపోలేదంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇదొక్కటే కాదు.. ఈ మధ్యనే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలోరావటం.. అదంతా ఉత్త పుకారేనని తేలటం.. చివరకు అలా జరిగిందంటూ సంచలనాల కోసం ఐష్ చావును వాడేసుకోవటం కనిపిస్తుంది. బుద్ధిలేక సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా తిరిగితే.. దాన్ని కూడా మీడియా ఫోకస్ చేయాలా? అన్నది ప్రశ్న.

ఇదిలా ఉంటే.. అమ్మ మరణం నేపథ్యంలో తమిళ హీరో అజిత్ కుమార్ ను అమ్మ వారసుడిగా పేర్కొనటం.. ఆయనే పార్టీకి పెద్ద దిక్కు అవుతారన్న ప్రచారంతో పాటు.. ఐసీయూలో ఉన్న అమ్మ.. తనకు చికిత్స జరిగిన సమయంలో అజిత్ గురించి ఆరా తీశారంటూకొంత ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదని అమ్మ సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. అజిత్ అంటే అమ్మకుఅభిమానమని.. సొంత బిడ్డలా చూసుకుంటారే తప్పించి.. ఆయన్నురాజకీయాల్లో తన వారసుడిగా తీసుకురావాలన్న ఆలోచన అస్సలు లేదని చెబుతారు. ఇంకాస్త పచ్చిగా చెప్పాలంటే..  అమ్మ ఎపిసోడ్ లో మసాలా మోతాదు పెంచే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ఏ పుణ్యాత్ముడో సృష్టించిన కథనమే తప్పించి.. మరింకేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News