మీ తోక ఎలా తొక్కాలో తెలుసు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-11-25 16:00 GMT
గ్రేటర్ లో మొదట స్నేహ పూర్వక పోటీ అనుకొని బరిలోకి దిగిన ఎంఐఎం , టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ప్రచారంలో మాత్రం ప్రత్యర్థులుగానే తలపడుతుండడం విశేషంగా మారింది. నేతల మాటలతో గ్రేటర్ పంచాయితీ ముదిరింది. టీఆర్ఎస్ పై ఎంఐఎం పార్టీ కీలక ఆరోపణలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందంటూ మండిపడ్డారు. ఒకప్పుడు 4,700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదని ఆయన ఆరోపించారు. అదంతా ఎవరు కాజేశారని నిలదీశారు. అంటే అంత స్థలం లో అక్రమ కట్టడాలు నిర్మించారని అని ప్రశ్నించారు.

అక్రమ కట్టడాలలో భాగంగా హుస్సేన్‍సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలన్నారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని పేదలకు హామీ ఇచ్చారు. ఇంతవరకు పేదలకు డబుల్ బెడ్ రూమ్ మాత్రం మంజూరు చేయలేదని విమర్శించారు అక్బరుద్దీన్.

ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ మాయ మాటలు చెబుతోందని.. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా మొన్న కురిసిన భారీ వర్షాలకు వరద బాధితులకు పదివేల రూపాయలు సహాయం అందిస్తున్నామని చెప్పి అందులో 5000 అధికారులే కొట్టేశారని అక్బరుద్దీన్ ఆరోపించారు. అసలు వరదల్లో ఇబ్బందులు పడిన వరద బాధితులకు మాత్రం ఈ పదివేల రూపాయలు అందలేదన్నారు.
Tags:    

Similar News