రాజకీయంగా చూస్తే బీజేపీ వారి ముందు జూనియర్ గానే అఖిలేష్ యాదవ్ ని చెప్పుకోవాలి. దశాబ్దం క్రితం ఆయన యూపీకి మొదటి సారి సీఎం అయినా తండ్రి చాటు బిడ్డగానే నాడు అంతా చూశారు. ఎపుడైతే ముఖ్యమంత్రి పగ్గాలు ఆయన చేపట్టారో నాటి నుంచి తానేంటో చూపించారు.
అదే టైమ్ లో రాజకీయంగా ఆరితేరారు. అయితే 2017లో దూకుడు గా సాగడంతో పాటు అఖిలేష్ చేసిన కొన్ని పొరపాట్లు, సామాజిక వర్గాల సమీకరణలు బీజేపీకి బాగా అడ్వాంటేజ్ గా మారాయి.
దాంతో బంపర్ మెజారిటీతో బీజేపీ యూపీలో పవర్ లోకి వచ్చింది. గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి మళ్ళీ ఎన్నికలు వచ్చేశాయి. ఈసారి మోడీ మ్యాజిక్ కానీ యోగీ ఆకర్షణ కానీ యూపీలో పెద్దగా పనిచేయడంలేదని ప్రచారం అయితే ఉంది. అదే టైమ్ లో బీజేపీ పెద్దలంతా యూపీ ఎన్నికల ప్రచారంలో పడ్డారు. చమటోడుస్తున్నారు. ఒక విధంగా ప్రధాని మోడీ నుంచి నంబర్ టూ అమిత్ షా వరకూ అందరికీ యూపీ టెన్షన్ మామూలుగా లేదు.
ఇక దేశాన్ని ఏలే వారు, బలమైన బీజేపీ నేతల పెదవుల ముందు పదే పదే పలికే పేరు ఏంటి అంటే అఖిలేష్ అనే. రోజుకు వందల వేల సార్లు ఆయన నామస్మరణతో కాషాయ దళం తరిస్తోంది. మాకు బలం ఉంది, యూపీలో మేమే మళ్లీ అంటున్న కమలనాధులు మీటింగుల్లో మాత్రం అఖిలేష్ ని దుమ్మెత్తిపోతున్నారు. ఆత్మ స్థితి పరనిందా అన్నది రాజకీయ నేతలకు సహజం.
కానీ ఇక్కడ చూస్తే ఆత్మ స్థుతి కూడా లేకపోయింది. తామేం చేశామో చెప్పుకోకుండా అంతా కలసి అఖిలేష్ మీద దండెత్తున్నారు అంటే యూపీలో ఏం జరుగుతోంది అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికి మెజారిటీ ప్రాంతాల్లో ఎన్నికలు ముగిశాయి. మార్చి ఏడవ తేదీతో చివరి విడత ఎన్నికలు పూర్తి అవుతాయి. మార్చి 10న రిజల్ట్ కూడా వస్తుంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసేది యూపీకి తదుపరి సీఎం ఎవరనే.
అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం అఖిలేష్ పేరే అదిరిపోతోంది. మరి అఖిలేష్ ని చీల్చి చెండాడి ఆయనకు ఓట్లు పడకుండా తమకే జనాలు ఓట్లు వేసేలా బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తాయా లేక బీజేపీ నేతలకు టార్గెట్ అయి నిద్ర లేకుండా చేస్తున్న అఖిలేష్ పీఠం ఎక్కేస్తారా అన్నదే చూడాలిపుడు.
ఏది ఏమైనా రాజకీయ సహజ సూత్రం ఏంటి అంటే ప్రత్యర్ధి పేరు పదే పదే అవతల వారు తలచుకుంటున్నారూ అంటే ఆయన అమిత బలవంతుడు అనే కదా అర్ధం. ఆ విధంగా చూస్తే యూపీ రిజల్ట్ మీద ఆత్రుత, ఆసక్తి మరింతగా పెరిగిపోతోందిపుడు.