మూఢత్వం గురించి వినటమే కానీ.. అదెలా ఉంటుందో.. దాని నగ్నత్వాన్ని చూసినంతనే ఎంతలా వణుకు పుడుతుందో మదనపల్లిలో చోటుచేసుకున్న జంట హత్యల ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది. కనిపెంచిన తల్లిదండ్రులు మూఢత్వంలోకి కూరుకుపోయి.. తమ చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారన్న విషయం ఎంతకూ జీర్ణించుకోలేని పరిస్థితి. చేతులార చంపి కూడా.. ఇప్పటికి మూఢత్వంలోనే ఉంటున్నవైనం చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం.
ప్రస్తుతం జైల్లో ఉన్న తల్లి.. అక్కడ కూడా జపాలు చేస్తూ.. ప్రార్థనల్లో మునిగిపోయి ఉన్న వైనం తెలిసినంతనే.. ఆమె మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయంపై అవగాహన రావటం ఖాయం. ఈ జంట హత్యల సంగతి తేల్చేందుకు తాజాగా పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు. హత్యకు గురైన అలేఖ్యకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టులు చూస్తే.. ఆమె మానసిక పరిస్థితి ఏ మాత్రం సరిగా లేదన్న భావన కలుగక మానదు.
తమ మరణానికి కాస్త ముందు.. అంటే ఈ నెల 22న తన పేరును మోహినిగా మార్చుకున్నట్లుగా పేర్కొంది. తనని తాను ప్రపంచ సన్యాసినిగా పేర్కొంది. ‘శివుడు వస్తున్నాడు’.. ‘పని పూర్తయింది’ అంటూ కొన్ని పోస్టులు పెట్టింది. శివుడ్ని విపరీతంగా ఆరాధించే అలేఖ్య.. చావు.. పుట్టుకలు తన చేతుల్లోనే ఉన్నాయని విశ్వసించటం విశేషం. ఒక ఆధ్యాత్మిక వేత్తను తన గురువుగా భావించిన ఆమె.. తరచూ ఆయన చెప్పే కోటేషన్లను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసేది. ఆయన్ను తన ప్రియుడిగా ఆమె పేర్కొనేది.
తన స్టడీరూంలోనూ ఆయన ఫోటోను పెట్టుకుంది. ఆయన రాసిన పుస్తకాల్ని విపరీతంగా చదివేది. పెళ్లి మీదా.. వివాహ వ్యస్థ మీద నమ్మకం కోల్పోయినట్లుగా ఆమె పోస్టులు అర్థం చెబుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో నెలల తరబడి ఇంట్లో ఉండిపోయిన ఆమె.. తన కాలాన్ని పూర్తిగా పుస్తక పఠనానికే ఎక్కువగా వినియోగించేది. ఆధ్యాత్మిక గ్రంధాలతో పాటు.. చారిత్రక.. రాజకీయ పుస్తకాల్ని విపరీతంగా చదివినట్లుగా తెలుస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను ఎవరిని ఆకర్షించలేకపోతున్ననన్న భావన ఆమెలో ఉందన్న విషయం ఆమె పోస్టుల్ని చూస్తే అర్థమవుతుంది. అది ఆమెకు నచ్చకపోవటాన్ని ప్రశ్నించుకునేది. సంక్రాంతి పండుగ వేళలో ఆమె పోస్టు చేసిన పోస్టు చూసినప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఇట్టే అర్థమైపోతుంది.
‘నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవటం కోసం నేను ఎవరినో కావాలని ప్రయత్నిస్తున్నాను. కానీ.. అవేమీ ఫలించటం లేదు. నా ఆశలు కాలిపోయాయి. నిరాశ అనే అగాధంలో కూరుకున్నా. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గందరగోళంలో పడిపోయా. ఇలాంటి వేళ.. నాలో కొత్త ఆలోచనలు ఉదయించాయి. వాటిని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నా’ అని రాసుకొచ్చింది. తీవ్రమైన నిరాశ.. అంతకు మించి ఒంటరితనం.. ఇంట్లో ఉండే పరిమితమైన వాతావరణం.. మొత్తంగా ఆమె మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా చెప్పక తప్పదు. ఒకవేళ.. లాక్ డౌన్ కాని లేకుంటే.. ఆమె తన పనుల్లో బిజీగా ఉండేది. అప్పుడు ఈ దారుణానికి అవకాశం ఉండేది కాదేమో?