పవన్‌ వద్దన్నాడు - నాగబాబు రమ్మంటాడా.?

Update: 2019-03-22 12:44 GMT
ఆ పార్టీలో చేరాలా - ఈ పార్టీలో చేరాలా అంటూ అన్ని పార్టీ ఆఫీసులు - పార్టీ అధినేతల చుట్టూ తిరిగి టైమ్‌ అంతా వేస్ట్‌ చేసుకున్నాడు అలీ. దీంతో.. ఎక్కడ తను అనుకున్నది వర్కవుట్ కాకపోయే సరికి అల్టిమేట్‌ గా వైసీపీలో చేరారు. ఎటూ ప్రభుత్వంవచ్చాక తనకు ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అనే ఉద్ధేశంతో. కానీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం అలీకి ఇష్టం లేదట. వైసీపీ - టీడీపీ లిస్ట్ వచ్చేసింది. ఇక లిస్ట్‌ పూర్తిగా రాని పార్టీ జనసేన మాత్రమే. దీంతో..జనసేన పార్టీలోకి వెళ్లి.. తనకు బాగా అచ్చొచ్చిన రాజమండ్రి లేదా గుంటూరు స్థానాల నుంచి పోటీ చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడని సమాచారం.

ఇదే విషయంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కి కూడా ఫోన్‌ చేశాడట అలీ. అయితే.. పవన్‌ అలీ ప్రతిపాదనకు నో చెప్పాడట. ఇప్పటికే సమయం చాలా మించిపోయిందని.. ఇలాంటి టైమ్‌ లో వస్తే సీటు ఇవ్వడం కూడా కరెక్ట్‌ కాదని చెప్పాడట. దీంతో.. అలీ ఆశలకు బ్రేక్‌ పడిపోయినట్లైంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కులు లాంటి అలీ.. తన  ప్రయత్నాల్ని నాగబాబు నుంచి ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై నాగబాబు సానుకూలంగా స్పందించాడని సమాచారం. నాగబాబు పవన్‌ కల్యాణ్‌ కు ఎంత చెప్తే అంత. కాదనలేడు. దీంతో నాగబాబు సైడ్‌ నుంచి నరుక్కొస్తున్నట్లు సమాచారం. మరి నాగబాబు ద్వారా అలీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో వెయిట్‌ అండ్ సీ.
Tags:    

Similar News