దిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొమ్మిది రోజుల క్రితం (నవంబరు 27) రాత్రి పది గంటల సమయం లో దిశ మీద గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. అమానవీయమైన రీతి లో ఆమెను హింసించి.. చంపేయటం తెలిసిందే. అనంతరం ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు వీలుగా పెట్రోల్.. డీజిల్ తో ఆమెను కాల్చేసే ప్రయత్నం చేశారు.
ఈ వైనం పెను సంచలాన్ని సృష్టించింది. తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకేలా చేసింది. నిందితుల్ని అదుపులో ఉంచుకొని.. వారిని ఉంచిన షాద్ నగర్ పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడి స్థానికులు స్వచ్ఛందంగా వేలాది మంది బయటకు వచ్చి.. నిందితుల్ని తమకు అప్పజెప్పాలని.. పది నిమిషాలు టైమిస్తే తాము చేయాల్సింది చేస్తామంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భం గా భారీ ఉద్రిక్తత కు దారి తీసింది.
దిశ ఉదంతం లో నిందితుల అర్థరాత్రి ఆరాచకం.. తాజా ఎన్ కౌంటర్ తో అర్థరాత్రే ముగిసినట్లుగా చెప్పాలి. కాకతాళీయంగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. హత్యాచారం చేసిన దిశను అర్థ రాత్రి దాటిన తర్వాతే చంపే ప్రయత్నం చేయటం.. ఆమెను కాల్చేయటం చేస్తే.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితుల్ని ఘటనాస్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత పారిపోయే ప్రయత్నం చేయగా కాల్పులు జరిపారు. మొత్తానికి దిశ నిందితుల అర్థరాత్రి ఆరాచకానికి అర్థరాత్రి సమయం లోనే ముగింపు రావటం గమనార్హం.