ముఖ్యమంత్రిని.. మంత్రుల్ని అంతగా తిట్టేయొచ్చా..?

Update: 2015-07-02 05:11 GMT
జైలు నుంచి బెయిల్‌ మీద బయటకు వచ్చిన తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి చేసిన ప్రసంగం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రతి మాటలోనూ ఒక తిట్టు ఉండేలా చూసుకున్న ఆయన.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను జైలుకు వెళ్లటానికి కారణం అయ్యారన్న బాధో.. తానే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి.. మంత్రులంతా కూడా తప్పులు చేసిన వారేనన్న విషయన్ని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించింది.

గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని.. మంత్రులను ఉద్దేశించిన రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

''ఈ సన్నాసులందరూ ఆ తాగుబోతోడి పక్కన చేరి.. ఆ తాగుబోతోడు సెప్పిందానికి సై అంటూ తందానా కొడుతుండ్రు. వీళ్లల్లో ఒక్కడన్నా పాత చెప్పుతో సమానంగా ఉన్నడా? గిలాసులు మోసే సన్నాసులు.. సోడాలు కలిపే బద్మాషులు ఈ రోజు ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నరు''

''ఓరేయ్‌ బద్మాష్‌.. నీ కొడుకు నిజామాబాద్‌లో ఇసుక అక్రమంగా తరలించింది నిజం కాదా? ఓరేయ్‌ ఆలుగడ్డలోడా.. ఈయాల్టికి కూడా నువ్వు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి మేం పెట్టిన భిక్ష రా. నిజంగా నీకు సిగ్గు ఉంటే.. నీకు నిజంగా శరం ఉంటే.. నిజంగా నువ్వు మనిషివి అయితే.. మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రారా.. అప్పుడు సెబుతాం.. మేమేందో..నువ్వేందో..''

''ఇయాళ.. కాలం కలిసి వస్తే వానపాము కూడా బుస కొడుతుందంట. ఇయాళ ఆ తాగుబోతోనికి ఎవరికి మంత్రి పదవులు ఇయ్వాలో తెల్వవక.. ఈ సన్నాసులకు మంత్రి పదవులు ఇస్తే.. ప్రజలకు పని చేయాల్సిన ఈ సన్నాసులంతా కేవలం తెలుగుదేశం పార్టీలోని వారినందరిని పార్టీలో చేర్చుకోవటానికి ప్రయత్నిస్తురు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని. నువ్వు సానా..సానా మాట్లాడుతున్నావే. యూనివర్సిటీలో రూ.7కోట్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదు. పది యూనివర్సిటీలు ఉంటే ఒక్కదానికి వైస్‌ ఛాన్సలర్‌ని పెట్టలేదు. ఓరే.. సన్నాసి పోయి.. వాళ్లను నియమించు''

''ఇంకొకడు.. అంత పొడుగున్నానంటడు. పెద్దమనషులు చెబుతుంటరు.. లంబుగాళ్లకు దిమాకు మోకాళ్లల్లో ఉంటుదని. ఇవాల తెలుగుదేశమోళ్లు ఇరుక్కున్నరు.. అట్లనే పోతరని. ఓరేయ్‌ సన్నాసి.. నీ మామ నీకు రబ్బర్‌ చెప్పులు లేనప్పుడు.. నీ సినిగిపోయిన లాగు తొడుక్కొని.. నీ మామ తాగి పడేసిన ఛాయి కప్పులు తీసినప్పుడు.. నీ మామ పాసుపోర్టులో కుంభకోణంలో ఉన్నడురా.. నీ మామ దుబాయ్‌ ఏజెంటు. నీమామ బతుకేందో.. ఒకసారి ఇంటికిపోయి.. అన్నం తిన్న తర్వాత మీ అమ్మను అడుగు. అమ్మ.. మేనమామ ఏం చేస్తుండినే అని. మీ మేనమామ గల్ఫ్‌ఏజెంటు. దుబాయికి జనాల్ని పంపిస్తానని సెప్పి డబ్బులు తీసుకుంటే.. జనాలు కేసులు పెడితే.. ఢిల్లీకి పోయి ఎమ్మెస్సార్‌ ఇంట్లో దాచుకున్న సన్నాసి నీ మామ. ఇయాళ నీ మామ.. పెద్ద ఉద్యమకారుడా? నీ మామ తెలంగాణ జాతిపితన. ఎవడన్నా సిగ్గున్నోడు తెలంగాణ ముఖ్యమంత్రిని జాతిపిత అంటాడా? ఆ జాతిపితకు సుక్క మందు తెల్వదు. మందు వాసన తెల్వదు. కానీ.. ఈ సన్నాసి రెండేస్తే కానీ నిలవడు.. నాలుగేస్తే కానీ కూర్సోడు. అలాంటోడు తెలంగాణ జాతిపిత అవుతాడా? ఆ సన్నాసేమో తెలంగాణ తెచ్చిండంట.. ఆ సన్నాసులేమో ఇచ్చిండంట. నేను అడుగుతున్నా.. ఆ సన్నాసి తెస్తే.. ఆ బద్మాష్‌లు ఇస్తే.. సచ్చిన 1200 మంది బిడ్డలు ఎవరి బిడ్డల్రా అని నేనీ రోజు అడుగుతున్నా?''

Tags:    

Similar News