అనగనగా మోడీ. ఆయన్ను రాజకీయంగా ఢీ కొట్టటం ఇప్పుడు పే..ద్ద కష్టంగా మారింది. అందుకే.. ఆట రూల్స్ ఛేంజ్ చేసేశారు. విషయం ఏదైనా సరే.. బురద తీసుకొని రెఢీగా ఉన్నారు. ఏ చిన్న ముచ్చట బయటకు వచ్చినా సరే.. దానికి కావాల్సినంత మసాలా చేర్చేసి..నిస్సిగ్గుగా మీద వేసేస్తున్నారు. మోడీని ఎక్కడో దెబ్బ కొడితే జరిగే నష్టం కంటే..కొన్ని రెట్లు ఎక్కవగా గుజరాత్ ఎన్నికల ఫలితాల డ్యామేజ్ ఉంటుందన్నది తెలిసిందే.
ఆ విషయం ప్రధాని మోడీకి తెలియంది కాదు. అందుకే మోడీ మొదలు.. కాంగ్రెస్ పార్టీ వరకూ అందరూ హుందాతనాన్ని పక్కన పెట్టేశారు. చిల్లర.. చిల్లరగా విమర్శలు చేసుకోవటం మొదలెట్టారు. జనాలు ఏమనుకుంటారో అన్నది పూర్తిగా వదిలేశారు. ఏ చిన్న సమాచారం దొరికినా.. దానికి ఎంత మసాలా దట్టించాలో అంతకు రెట్టింపు మసాలాను దట్టించి జనం మీదకు వదలటం అలవాటైంది.
తాజాగా మోడీ అందం మీద ఫోకస్ చేశారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఒకప్పుడు నల్లగా ఉండే మోడీ.. ఇప్పుడు టమోటా పండు మాదిరి మారిపోయారు చూశారా? అంటూ మోడీ స్కిన్ టోన్ గురించి కొత్త ముచ్చట మొదలెట్టారు. ఎక్కడో స్టార్ట్ అయిన ఓ చిన్న విమర్శకు మసాలా చేర్చి.. చేర్చి..చివరకు భారీ బండ వేసేందుకు కాన్సెప్ట్ సిద్ధం చేశారు.
సోషల్ మీడియాలోనూ.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ముచ్చట ఏమిటంటే.. మోడీ రోజు వారీ భోజనం ఖర్చు ఎంతో తెలుసా? అంటూ అవాక్కు అయ్యే మాటల్ని చెబుతున్నారు. ఇంతకీ మోడీ మీద విపరీతమైన ఆరోపణలు చేస్తుంది ఎవరో కాదు.. రాథన్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అల్ఫేశ్ ఠాకూర్. ఇప్పటికే మోడీ మీద తీవ్ర ఆరోపణల్ని అలవోకుగా చేసే అల్పేశ్ తాజాగా చిత్రమైన ఆరోపణలు చేశారు.
ప్రధాని తినేది అలాంటి ఇలాంటి భోజనం కాదు.. తైవాన్ నుంచి తెప్పించే పుట్టగొడుగులు అని.. అవి ఒక్కొక్కటి రూ.80వేల ఖరీదు ఉంటాయని చెబుతున్నారు. ఇలా విదేశాల నుంచి తెప్పించే ఐదు మష్ రూమ్స్ ను మోడీ తింటారని.. ప్రధాని తిండి ఖర్చే ఇంత ఉంటే సాధారణ బీజేపీ కార్యకర్త ఖర్చు ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చని సరికొత్త ఆరోపణలు చేశారు.
భోజనం ఖర్చుతో ఆపితే విషయం మరోలా ఉండేదేమో. తాను చేసిన ఆరోపణలు సరిపోలేదన్నట్లుగా ఫీలైన ఈ యువనేత.. మోడీ స్కిన్ టోన్ గురించి కూడా మాటలు అనేశాడు. ఒకప్పుడు నల్లగా ఉండే మోడీ ఇప్పుడు టమోటా కలర్ లోకి వచ్చేశారని.. ఇదంతా పుట్టగొడుగులు అదేనండి తైవాన్ మష్ రూమ్స్ పుణ్యమేనని చెబుతున్నారు.
అయినా.. మోడీ వంటింట్లో ఏదో సీసీ కెమేరా పెట్టినంత బాగా.. ఆయనేం తింటున్నారు? ఎన్ని తింటున్నారో లెక్క చెప్పి అవాక్కు అయ్యేలా చేస్తున్నారు. మోడీ తిండి ఖర్చు లెక్క జనాలు అనుమానపడేలా ఉంటే.. నల్లగా ఉండే మోడీ టమోటాగా మారిపోయారనే మాటను పట్టుకొని ఎంత సెంటి మెంట్ పిండుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా గుజరాత్ ఎన్నికలు దేశానికి చేసిన నష్టం ఏమిటంటే.. ఎంత మాట పడితే అంత మాటను అనేయటం.. అది కూడా వెనుకా ముందు చూసుకోకుండా. అది ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ దగ్గర నుంచి అల్పేశ్ వరకూ అందరికి ఒకే బాట కావటం గమనార్హం.