అంబటి రాయుడు పరిచయం అక్కర్లేని పేరు. అపారమైన ప్రతిభ ఉన్నా స్వయంకృతాపరాధాలు కొన్ని, బీసీసీఐ రాజకీయాలు కొన్ని కలిసి జాతీయ జట్టులో అవకాశాలు లేకుండా చేశాయి. గతంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడిన అంబటి రాయుడు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. ఇటీవల ఐపీఎల్ టైటిల్ ను చెన్నై గెలుచుకున్నాక ఐపీఎల్ కు కూడా రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అంబటి రాయుడిది గుంటూరు జిల్లా. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడుకు గత వన్డే వరల్డ్ కప్ లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. త్రీ డైమన్షన్ ఆటగాడు అని విజయ్ శంకర్ ను ఎంపిక చేసినా అతడు ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో తాను ఎంత బాగా ఆడుతున్నా తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో విసిగి వేసారిపోయిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
కాగా గత కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా అంబటి రాయుడు వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీని, సీఎం వైఎస్ జగన్ ను సోషల్ మీడియాలో అంబటి రాయుడు అనుసరిస్తుండటం ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా వైసీపీ పోస్టులకు కూడా ఆయన లైక్ కొడుతున్నారు.
అంతేకాకుండా ఇటీవల కుటుంబంతో కలసి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఆయన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు.
ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తున్నానని, గ్రామాల్లో ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకుంటున్నానని అంబటి రాయుడు తెలిపారు. ప్రజా సేవ చేయాలంటే క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం అవసరమన్నారు. అందుకే తాను గ్రామాల్లో పర్యటిస్తున్నానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనేదే ఆయన ఉద్దేశమని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టాక్ నడుస్తోంది. అంబటి రాయుడును గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయించొచ్చని ప్రచారం జరుగుతోంది. లేకపోతే గుంటూరు పశ్చిమ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు.
అంబటి రాయుడు సీఎం జగన్ ను కలిసింది కూడా పూర్తిగా రాజకీయ కారణాలతోనేనని అంటున్నారు. తనకు అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని అంబటి రాయుడు జగన్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.