మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా సన్నిహితుడా పేరు పొందారు అంబికా కృష్ణ. అంబికా దర్బార్ బత్తీ సంస్థ యాజమానిగా - పలు సినిమాల నిర్మాతగా ఆయనకు పేరుంది. బాలకృష్ణతో సినిమాలు తీసిన నేపథ్యం ఉంది ఆయనకు. చంద్రబాబుకు సన్నిహితుడుగా గతంలో పార్టీ అధికారంలో లేని కాలంలో కూడా టీడీపీతో పని చేశారాయన.
అయితే ఇప్పుడు మాత్రం అధికారం కోల్పోయిన వెంటనే ఆయన బీజేపీలోకి చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ వల్ల తనకు దక్కినది ఏమీ లేదని - తనే పార్టీకి ఉపయోగపడినట్టుగా చెప్పుకుని ఆయన బీజేపీలోకి చేరిపోయారు.
ఇక తన అన్న బీజేపీలోకి చేరినా తను మాత్రం ఆ పార్టీలో చేరే ప్రసక్తి లేదని అంబికా రాజా చెబుతూ వచ్చారు. తను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్టుగా ఆయన చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన మంత్రి ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే లాంఛనాన్ని ఆయన అలా పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో అంత యాక్టివ్ గా ఉండేవారు కాదు రాజా. అంబికా కృష్ణ మాత్రం చంద్రబాబుకు సన్నిహితుడిగా చలామణి అయ్యే వారు. ఇప్పుడు ఆయన, ఆయన తమ్ముడు చెరో పార్టీలోకి చేరిపోయారు.